Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో నా పెళ్లి చేయాలని చూస్తున్నారు.. పెళ్లిపై రష్మిక కామెంట్స్..

- Advertisement -

Rashmika Mandanna : గీతా గోవిందం సినిమాలో నటించినప్పటి నుంచి విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఏదో ఉందనే మాట వినిపిస్తునే ఉంది. ఈ ఇద్దరు కలిసి తరచుగా వెకేషన్స్‌కి వెళ్ళడం, డిన్నర్ డేట్స్ అంటూ సీక్రెట్‌గా వెళ్తు సోషల్ మీడియాలో దొరికిపోతున్నారు. కానీ ఇప్పటి వరకు మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. అలాంటప్పుడు ఇద్దరు సీక్రెట్‌గా ఎందుకు చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారనే కామెంట్స్ వినిపిస్తునే ఉన్నాయి.

Rashmika Mandanna
Rashmika Mandanna

ఎవరెన్ని చెప్పినా విజయ్‌ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. రీసెంట్‌గా ఫిబ్రవరిలోనే ఎంగేజ్మెంట్ ఉంటుందని.. ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయం పై విజయ్‌ దేవరకొండ స్పందిస్తూ.. అసలు ఇలాంటి వార్తల్లో నిజం లేదని కొంతమంది కావాలనే ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారని అన్నాడు. ఇలాంటి రూమర్స్ ప్రతి ఏడాది వింటూ వస్తున్నాను.. వాళ్లే నన్ను పట్టుకొని పెళ్లి చేయాలని చూసున్నారేమో.. అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు.

Vijay Deverakonda Rashmika Mandanna

ఇప్పుడు రష్మిక కూడా అలాగే రియాక్ట్ అయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్ దేవరకొండతో తన రిలేషన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తను ప్రతి పనిలో విజయ్ సహకారం ఎప్పుడూ ఉంటుందని.. ప్రతి చిన్న విషయంలోనూ విజయ్ దేవరకొండ సలహా తీసుకుంటానని చెప్పుకొచ్చింది. ఎందుకంటే విజయ్ దేవరకొండ ఏది మంచో ఏది చెడో వివరించి చెబుతాడని చెప్పింది. అలాగే ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్, పెళ్లి న్యూస్ పై కూడా స్పందించిందిట. ప్రతి రెండేళ్లకు ఓసారి మీడియా సంస్థలు మా ఇద్దరికీ పెళ్లి చేయాలని భావిస్తున్నట్లుగా ఉంది వ్యవహారం.. వాళ్ళు నేను కనిపిస్తే చాలు పెళ్లి చేయాలని భావిస్తున్నారని.. సరదాగా చెప్పుకొచ్చిందిట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here