టాలీవుడ్ అయిపోయింది.. బాలీవుడ్ జనాలను పొగిడేస్తున్న రష్మికా మందాన

- Advertisement -

నేషనల్ క్రష్ రష్మికా మందాన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పుష్ప సినిమాతో ఆమె దేశవ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకున్నారు. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కతున్న పుష్ప 2 సినిమాలో కూడా హీరోయిన్‌గా చేస్తున్నారు. అంతేకాదు, పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్‌ను ఓ రేంజ్‌లో ఉపయోగించుకుంటున్నారు రష్మిక. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో అవకాశాలను పట్టేస్తున్నారు. అర్జున్ రెడ్డి డైరెక్టర్‌‌ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న యానిమల్ సినిమాలో హీరోయిన్‌గా చేశారు. ఈ సినిమాలో రష్మిక పార్ట్ షూటింగ్ ఇటీవలే పూర్తయ్యిందని తెలిపారు.

 రష్మికా మందాన
రష్మికా మందాన

అయితే, యానిమల్ సినిమా నుంచి ఇటీవల వచ్చిన టీజర్ గూస్ బంప్స్ తెప్పించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈ టీజర్‌‌లో వయోలెన్స్‌కు అందరూ షాక్ అయ్యారు కూడా. ఇక, యానిమల్ సినిమాకు సంబంధించి త‌న షూటింగ్ పార్ట్ పూర్త‌యిన‌ట్టు అనౌన్స్ చేసింది ర‌ష్మిక. యాభై రోజుల పాటు తాను ఈ సినిమాకు డేట్స్ కేటాయించానని, త‌న పార్ట్ షూట్ పూర్తి చేసుకున్న‌ట్టుగా ర‌ష్మిక ఇన్ స్టాలో ఒక స్టోరీ షేర్ చేసింది రష్మిక. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావ‌డంతో పుష్ప 2 సెట్స్ కు వెళ్లనున్న‌ట్టు కూడా చెప్పింది ర‌ష్మిక.

Rashmika Mandanna

మ‌రి ఈ అప్ డేట్ తో పాటు రణ్‌బీర్‌‌ కపూర్‌‌పై పలు కామెంట్లు చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట్ వైరల్ అవుతున్నాయి. ర‌ణ్ బీర్ క‌పూర్ ను ఒక రేంజ్ లో పొగిడేసింది. ‘ర‌ణ్ బీర్ చాలా ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తి . చాలా గొప్ప మ‌నిషి. అంతే కాదు.. ర‌ణ్ బీర్ ను త‌యారు చేయ‌డానికి దేవుడు ప్ర‌త్యేకంగా స‌మ‌యం కేటాయించాడు. దేవుడు ప్ర‌త్యేకంగా స‌మ‌యం తీసుకున్నాడు గనుకనే ర‌ణ్ బీర్ అంత ప్ర‌త్యేకం’ అని చెప్పుకొచ్చింది ఈ నేషనల్ క్రష్. అత‌డితో ప‌ని చేయ‌డం పూర్వ జ‌న్మ సుకృతం అనే రేంజ్‌లో స్పందించింది రష్మిక. రణ్‌బీర్‌‌తో ఎన్ని సినిమాలు అయినా చేయవచ్చు అనే అర్ధం వచ్చేంతలా కామెంట్లు పెట్టేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here