తండ్రి చెంతకు చేరిన విష్ణు ప్రియా.. ఎమోషనల్ అవుతూ ఏడ్చేసిన విష్ణు..

- Advertisement -

యాంకర్ విష్ణు ప్రియా పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది.. పైకి కనిపించే అంత ఆమె జీవితంలో సంతోషం లేదని అందరికి తెలిసిందే.. బుల్లి తెరపై విష్ణు ప్రియకి మంచి క్రేజ్ ఉంది. హాట్ యాంకర్ గా, మంచి డ్యాన్సర్ గా మాత్రమే ఈమె గురించి తెలుసు. పలు టీవీ షోలకి తన అందంతో, చిలిపి తనంతో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. అయితే విష్ణు ప్రియ కెరీర్ ని చూసుకుంటే మూడేళ్ళ వయసు నుంచే చాలా కష్టాలు అనుభవించిందని తెలుస్తుంది. ఈమెకు మూడేళ్ళ వయసున్నప్పుడు వీరి పేరెంట్స్ విడిపోయారు. ఆ తర్వాత తన తల్లి దగ్గరే ఈమె జీవితాన్ని కొనసాగించగా.. తండ్రి మాత్రం వేరే పెళ్లి చేసుకున్నాడు..

విష్ణు ప్రియా
విష్ణు ప్రియా

విష్ణు భాధ్యత మొత్తం తల్లే చూసుకుంది.. ఇప్పటివరకు తల్లి అలనా పాలనా చూసుకుంది.. ఇటీవలే తన తల్లి చనిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయింది. కానీ తాజాగా తన తండ్రి దగ్గరకు చేరుకున్న విష్ణు ప్రియ ఫాదర్స్ డే సందర్భంలో జీ తెలుగులో ‘నేను నాన్న’ స్పెషల్ ఈవెంట్‌ను నిర్వహించారు.. ఆ ఈవెంట్ కు తన తండ్రితో పాటు వచ్చింది..అందరు వారిద్దరినీ చూసి ఆశ్చర్య పోయారు.. ఈ సందర్బంగా స్టేజ్ పైన మాట్లాడుతూ.. నాన్నని ప్రేమించని వ్యక్తి ఎవరు ఉంటారు..?’ అంటూ తాను ఆలస్యంగా పొందుకున్న తండ్రి ప్రేమ గురించి చెప్పుకొచ్చింది..

మూడేళ్లు ఉన్నప్పుడే అమ్మా నాన్నలు విడిపోయారు. ఇటీవలే మా అమ్మ చనిపోయారు. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో చూశాను.. ఇప్పుడు అమ్మ చనిపోయిన తరువాత నాన్న ప్రేమ ఎలా ఉంటుందో చూస్తున్నా.. దాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నా.అమ్మ నాన్నలు విడిపోయినందుకు నేను చాలా లైఫ్ మిస్ అయ్యాను. అందుకే వాళ్లని తిట్టుకుంటూనే ఉన్నాను. నాలాగే మీలో ఎవరైనా నా స్థానంలో ఉంటే.. దయచేసి ద్వేషించవద్దు.. వాళ్లు ఎందుకు అలా చేశారో అర్ధం చేసుకోండి.. వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో అలా చేశారో తెలుసుకోండి.. ఇప్పుడు నాకు తమ్ముడు చెల్లి కూడా ఉన్నారు అంటూ ఎమోషనల్ అయ్యింది.. అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here