మరికొన్ని రోజుల్లో తెలుగు తెరకు గుడ్ బాయ్ చెప్పనున్న రష్మిక..

- Advertisement -

ఇప్పటికే రష్మికపై కన్నడ ఇండస్ట్రీ గుర్రుగా ఉన్న విషయ తెలిసిందే. ఆమెను అక్కడ పూర్తిగా బ్లాక్ చేసేశారు. రష్మిక మందన్న పూర్వజన్మలో పుట్ బాల్ ప్లేయర్ అయ్యుంటారబ్బా..! అదేంటి అలా అంటున్నారు..? ఫుట్ బాల్‌కు ఈమెకు లింక్ ఏంటనే డౌట్ రావచ్చు. కానీ ఈ వివరణ చూసిన తర్వాత మీరే అంటారు రష్మిక పూర్వ జన్మలో కాదు.. ఈ జన్మలోనే ఫుట్ బాల్ ప్లేయర్ అని. మరి ఆమె గేమ్ ఏంటో చూద్దామా.. ఇంతకీ రష్మిక ఎవరితో ఫుట్ బాల్ ఆడుతున్నారు..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవేయండి..

రష్మిక
రష్మిక

ప్రస్తుతం రష్మిక చేతిలో తెలుగు సినిమాలేవీ లేవు. ఒక్క పుష్ప2 మాత్రమే ఉంది. దాని షూటింగ్ తర్వాత అమ్మడికి తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు. రష్మిక చేసే పనులకు మైండ్ బ్లాక్ అయిపోద్దని.. మనకు అర్థం కావడానికి కాస్త టైమ్ పట్టింది అంటున్నారు ఆమె తీరు చూసాక దర్శక నిర్మాతలిప్పుడు. ఒక్కసారి ఆమె కెరీర్‌ను పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈమె ఫోకస్ అంతా బాలీవుడ్‌పై ఉంది. అందులో తప్పేముంది.. ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి చేస్తుందనుకోవచ్చు. అక్కడే ఉంది అసలు ట్విస్ట్.

అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే టైప్ రష్మిక. అందుకే బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నప్పుడే అక్కడ అందిన దగ్గరకి ఆఫర్లు కొట్టేస్తుంది. హిందీలో రణ్‌బీర్ కపూర్‌తో యానిమల్‌లో నటిస్తున్న రష్మిక.. ఆ తర్వాత షాహిద్ కపూర్, విక్కీ కౌశల్ లాంటి హీరోలతో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో రష్మిక ఎప్పుడూ నెంబర్ వన్నే. అప్పట్లో తెలుగులో ఛాన్స్ వచ్చినపుడు కన్నడ ఇండస్ట్రీని ఫుట్ బాల్‌లా తన్నేసారు. దాంతో కన్నడిగులు ఈమెపై కన్నెర్ర జేసారు కూడా.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here