‘ఏజెంట్’ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి కారణం రామ్ చరణా..? అసలు నిజం భయటపడిందిగా!

- Advertisement -

అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఏజెంట్ ‘ ఎంత ఫ్లాప్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా అఖిల్ కెరీర్ ని బాగా దెబ్బ తీసింది.ఈ చిత్రం కోసం ఆయన రెండేళ్ల సుదీర్ఘ సమయాన్ని వెచ్చించి ఎంతో కష్టపడ్డాడు.కానీ ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. ఈ సినిమా పై అక్కినేని ఫ్యాన్స్ మొదటి నుండి భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఇది అఖిల్ కెరీర్ లోనే భారీ సినిమా, అంతకు ముందు ఆయన కేవలం లవ్ స్టోరీస్ మాత్రమే చేస్తూ వచ్చాడు, అవి కూడా పెద్దగా సక్సెస్ కాలేదు, ఆయన కెరీర్ కి ఏమాత్రం ఉపయోగ పడలేదు.

ఏజెంట్
ఏజెంట్

కానీ ‘ఏజెంట్’ చిత్రం తో ఏకంగా వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టబోతున్నాడు అని అక్కినేని ఫ్యాన్స్ విడుదలకు గర్వంగా చెప్పుకునే వాళ్ళు.కానీ సినిమా విడుదల వాయిదా పడుతున్నప్పుడే హైప్ మొత్తం పోయింది, దానికి తోడు టాక్ కూడా డిజాస్టర్ అవ్వడం తో ఓపెనింగ్స్ కూడా సరిగా రాలేదు.

అయితే ఈ సినిమా అఖిల్ కి సజెస్ట్ చేసింది రామ్ చరణ్ అట. ధ్రువ వంటి భారీ హిట్ తర్వాత మరోసారి రామ్ చరణ్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ‘ఏజెంట్’ చిత్రం తెరకెక్కాల్సింది అట. రామ్ చరణ్ కి స్టోరీ లైన్ నచ్చి ఓకే చెప్పాడు కూడా, కానీ ఆయనకీ ఉన్న కమిట్మెంట్స్ వల్ల ఈ చిత్రాన్ని చెయ్యలేకపోయాడు, భారీ యాక్షన్ సినిమా కాబట్టి ఈ చిత్రాన్ని అఖిల్ తో చెయ్యమని రామ్ చరణ్ సురేందర్ రెడ్డి కి చెప్పాడట. అఖిల్ కూడా చరణ్ చెప్పడం తో బౌండెడ్ స్క్రిప్ట్ లేకపోయినప్పటికీ నటించడానికి ఒప్పుకున్నాడు.

- Advertisement -

అదే ఆయన చేసిన పెద్ద పొరపాటు. షూటింగ్ కొంతభాగం పూర్తి అయినా తర్వాత సురేందర్ రెడ్డి కి మరియు నిర్మాత అనిల్ సుంకర కి మధ్య గొడవలు ఏర్పడ్డాయి. దీనితో సురేందర్ రెడ్డి మిగతా సగం షూటింగ్ పూర్తి చెయ్యకుండానే వెళ్ళిపోయాడు, ఆ తర్వాత మిగిలిన భాగానికి ఆ చిత్ర రచయితా వక్కంతం వంశీ దర్శకత్వం వహించాడు.అందుకే ఆ చిత్రం అలా వచ్చింది అని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్.అలా ఈ సినిమాని అఖిల్ కి సజెస్ట్ చేసి ఆయనకీ చరణ్ పరోక్షంగా ఫ్లాప్ ఇవ్వడానికి కారణం అయ్యాడని అంటున్నారు అభిమానులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here