టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రష్మిక తరచూ ఈ మధ్యకాలంలో ఎఫైర్ వార్తలలో నిలుస్తూనే ఉంది. గతంలో హీరో విజయ్ దేవరకొండ తో ఈమె రిలేషన్ షిప్ లో ఉందంటూ వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత మళ్లీ కొద్ది కాలానికి బెల్లంకొండ శ్రీనివాస్ పేరు ఎక్కువగా వినిపించింది. బాలీవుడ్ ఈవెంట్లు ఇద్దరూ కలిసి కనిపించడంతో ఆ తర్వాత మళ్లీ ఒకటి రెండు సందర్భాలలో కూడా వీరిద్దరూ జంటగా కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఈ విషయంపై బెల్లంకొండ శ్రీనివాస్ కూడా స్పందించారు.

హీరోయిన్ రష్మికతో మంచి స్నేహం ఉందని..అంతమాత్రానికే డేటింగ్ అని రాసేస్తారా అని మండిపడ్డాడు టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్..షూటింగ్ పనిపై ముంబైకి వెళ్లినప్పుడు ఎయిర్ పోర్ట్ లో కలుసుకుంటూ ఉంటామని, అలా అనుకోకుండా కలుసుకున్న సందర్భాలు కూడా తక్కువే అన్నారు. అంతమాత్రానికే ఇలాంటి వార్తలు రాసేస్తారా అని ప్రశ్నించారు. అవన్నీ పుకార్లేనని, వాటిని నమ్మవద్దని బెల్లంకొండ క్లారిటీ ఇచ్చారు. వాళ్లిద్దరి మధ్య ప్రేమలేదని స్పష్టంగా చెప్పారు. కానీ నెటిజన్లు మాత్రం విజయ్ దేవరకొండని, బెల్లంకొండ శ్రీనివాస్ ను ఇద్దరినీ లైన్లో పెట్టిందని అంటున్నారు.

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ ఛత్రపతిలో నటిస్తున్నాడు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసిన టీమ్.. ఈమూవీ ప్రమోషన్స్ పై గట్టిగా దృష్టి పెట్టింది. ఇక ఈసినిమాకు సంబంధించి వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు యంగ్ హీరో.. కాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నతో మీరు డేటింగ్‌లో ఉన్నట్టు వస్తున్న వార్తలపై ఏమంటారు అని అడగగా..హీరో బెల్లంకొండ శ్రీనివాస్ స్పందించారు. ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు.