ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గీతగోవిందం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ముద్దుగుమ్మ రష్మిక. పుష్ప సినిమా తర్వాత తన క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేషనల్ క్రష్ అయిపోయింది. ఇటు సౌత్ అటు నార్త్ సినిమాల్లో వరుసగా నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇటు సినిమాలు అటు యాడ్ల రూపంలో నాలుగు చేతులా సంపాదిస్తుంది. రోజు రోజుకి రష్మిక ఇమేజ్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. టాప్ స్టార్లంతా రష్మిక కోసం క్యూ కడుతున్నారు. ఈ ఏడాది మొదట్లోనే దళపతి విజయ్ సరసన వారసుడు సినిమాతో బంపర్ హిట్ కొట్టింది. అటు బాలీవుడ్ లో మిషన్ మజ్ను సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం రష్మిక.. రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంద

ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగ తెరకెక్కిస్తున్నాడు. వచ్చే డిసెంబర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అయితే రష్మిక విషయంలో ఈ నెలకు సంబంధించి ఓ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రష్మికకు ఈ నెలంటే ఎంతో ఇష్టమట.. తనకు అదృష్టమట కూడా. ఎందుకంటే రష్మిక నటించిన ఫస్ట్ మూవీ కిరీక్ పార్టీ 2016 డిసెంబర్లో కన్నడలో విడుదల అయింది. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతే కాకుండా తెలుగులో అల్లు అర్జున్ తో కలిసి నటించిన పుష్ప కూడా 2021 డిసెంబర్లో విడుదలై పాన్ ఇండియన్ హీరోయిన్ గా ఖ్యాతి తెచ్చి పెట్టింది. ఇలా తన కెరియర్లో డిసెంబర్ నెల తనకు చాలా ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది. ఇప్పుడు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న యానిమల్ కూడా డిసెంబర్లోనే రానుంది. దీంతో ఈ సినిమా మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
