పుట్టింది తెలుగు రాష్ట్రంలోనైనా హీరో అయ్యింది మాత్రం తమిళ ఇండస్ట్రీలో.. ఒక్కొక్క సినిమా ఓ వైవిధ్యభరితమైన కథనాన్ని ఎంచుకుని వరుస విజయాలు అందుకుంటూ కోలీవుడ్ స్టార్ హీరో అయిపోయారు విశాల్. అక్కడ ఆయన నటించిన చాలా చిత్రాలు టాలీవుడ్ లో కూడా మంచి విజయం సాధించాయి. తను తమిళంలో నటించిన ప్రతి చిత్రం తెలుగులో విడుదలవుతుంది. తెలుగులో కూడా చాలామంది విశాల్ అభిమానులు ఉన్నారు. అక్కడా ఇక్కడా విశాల్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది.
హిట్ ఫట్ తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ ఎప్పుడూ బిజీగా ఉంటారు విశాల్. ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ప్రస్తుతం మళ్లీ ఆయన వార్తలకెక్కారు. కాకపోతే ఇప్పుడు వ్యక్తిగత విషయం పైన. అవును విశాల్ పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తను ఓ స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబుతున్నారన్న వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ హీరో విశాల్ పెళ్లి చేసుకోబోయే ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆవిడ మరెవరో కాదంటూ కోలీవుడ్లో రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. తమిళ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన లక్ష్మీ మీనన్ నే విశాల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడట. ఈ వార్త సినీ ఇండస్ట్రలో చర్చనీయాంశమైంది.
ప్రస్తుతానికి వార్తలపై విశాల్, లక్ష్మీ మీనన్ ఇద్దరిలో ఎవరూ నోరు మెదపలేదు. దీంతో ఈ వార్త నిజమేనా అంటూ మరోసారి వార్తలను అభిమానులు వైరల్ చేశారు. కచ్చితంగా పెళ్లి విషయంపై క్లారిటీ కావాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ విషయంపై విశాల్ స్పందించాల్సి వచ్చింది. ఇందులో నిజం లేదని.. అది కేవలం పుకారు మాత్రమే అంటూ బాంబు పేల్చారు. దీంతో లక్ష్మీ మీనన్ తో తన పెళ్లిపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టాడు. ఇలాంటి ఫేక్ న్యూస్ లను ప్రచారం చేయవద్దంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు.