Rashmika : తనకన్నా 30ఏళ్లు పెద్దవాడైన హీరోతో రష్మిక రొమాన్స్

- Advertisement -

Rashmika : పుష్ప సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది రష్మిక మందన్నా.. ఆ సినిమాతో నేషనల్ క్రష్ కూడా అయింది. ప్రస్తుతం ఖాళీ లేకుండా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ లైఫ్ గడుపుతోంది. టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లోనూ అమ్మడే ఫస్ట్ ఛాయిస్. ప్రస్తుతం తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకత్వంలో పుష్పకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2లో నటిస్తోంది. దాంతో పాటు హిందీలో ర‌ణ‌బీర్ క‌పూర్ తో యానిమ‌ల్‌ చేస్తుంది. వీటితో పాటు రీసెంట్ గా కెరీర్లోనే మొదటి లేడీ ఓరియెంటెడ్ మూవీ కమిట్ అయింది. రెయిన్ బో అనే టైటిల్ సినిమాకు ఖరారు చేశారు. ఈసినిమాలో శాకుంతలం ఫేమ్ దేవ్ మోహ‌న్ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ మూడు ప్రాజెక్టులు సెట్స్ మీదే ఉన్నాయి. కోలీవుడ్ లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోందంటూ వార్తలు వస్తున్నాయి.

Rashmika
Rashmika

ఓ తమిళ స్టార్ హీరో సరసన నటించేందుకు అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా సంబంధించిన అన్ని చర్చలు కంప్లీట్ అయ్యాయని కొన్ని రోజుల్లోనే షూటింగ్ స్టార్ట్ కాబోతుందని సమాచారం. అపరిచితుడు సినిమాతో నేషనల్ స్టార్ అయిపోయిన చియాన్ విక్రమ్ కొత్త సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోందట. అంతే కాకుండా వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఓ కీలకపాత్ర పోషిస్తున్నారట. బ్లాక్ బస్టర్ మలయాళ చిత్రం ‘2018’కి డైరెక్షన్ చేసిన జూడ్ ఆంటోని జోసెఫ్ ఈ మల్టీ స్టారర్‌ సినిమాను తెరకెక్కిస్తున్నారట.

తమిళంలో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థ లైకా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. చియాన్ విక్రమ్, రష్మిక, విజయ్‌ తదితరులతో నిర్మాణ సంస్థ చర్చలు జరిపిందని, వారు కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. అయితే ర‌ష్మిక ఈ సినిమాను ఒప్పుకోవడం కొందరు ఫ్యాన్స్ కు సహించడం లేదట. కారణం విక్రమ్ రష్మిక కంటే దాదాపు 30ఏళ్లు పెద్దవాడు. దీంతో ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉంది. దీంతో తండ్రి వయస్సున్న హీరోతో నీకు రొమాన్స్ ఏంటి మైండ్ దొబ్బిందా అంటూ ఫ్యాన్స్ రష్మికు ఏకి పారేస్తున్నారు. ఒక్కసారి సీనియర్ యాక్టర్ తో చేస్తే యంగ్ హీరోలు నిన్ను పట్టించుకోవడం మానేస్తారని హితవు పలుకుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here