అలాంటి పాత్రలో నటించడానికి ఒప్పుకున్న రష్మిక.. షాక్ లో ఫ్యాన్స్

- Advertisement -

నేషనల్ క్రష్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన్న. యంగ్ హీరోలతో మొదలు పెట్టి ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. తెలుగుతో పాటు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది రష్మిక. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ.. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. గీతగోవిందం సినిమాతో హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రష్మిక దశ తిరిగింది. ఆ వెంటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది ఈ శ్రీవల్లి. పుష్ప పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ అయ్యింది.

రష్మిక మందన్న
రష్మిక మందన్న

ఇప్పుడు ఈ అమ్మడు ఒక మహారాణి పాత్రలో కనిపంచనుందని అంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు. బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌తో కలిసి రష్మిక (Rashmika) ఓ సినిమాలో నటించనుందని టాక్‌ వినిపిస్తోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ కుమారుడు శంభాజీ మహారాజ్‌ (Sambhaji Maharaj) జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్‌లో ఓ ప్రాజెక్ట్‌ తీస్తున్నారు. ఇందులో ఆయన భార్య ఏసుబాయ్‌ (Yesubai Bhonsle) పాత్రలో రష్మిక కనిపించనుందని టాక్‌ వినిపిస్తోంది.

ఈ సినిమా కోసం రష్మిక కసరత్తులు కూడా చేస్తోందట. ఈ సినిమాలో రష్మిక పాత్ర కీలకం కానుందని తెలుస్తోంది. భార్యభర్తల మధ్య ఎమోషనల్‌ లవ్ స్టోరీ ఇందులో చూపించనున్నారట. ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ కూడా మొదలుపెట్టిందట. ఇక ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అంత గొప్ప పాత్రలో నటించనుందని ఆనందంలో ఉన్నారు.

- Advertisement -
Rashmika Mandanna Photos

ప్రస్తుతం రష్మిక మందన్న టైమ్ నడుస్తుంది. లక్కీ హీరోయిన్ గా పాన్ ఇండియా భాషల సినిమాలతో రష్మిక చేస్తున్న హడావిడికి మిగతా హీరోయిన్స్ కి నిద్ర కూడా పట్టదు. అంత బిజీ హీరోయిన్ గా రష్మిక చక్రం తిప్పడమే కాదు.. స్టేజ్ పై వచ్చే అవకాశాలను అస్సలు వదులుకోవడం లేదు. ఏదోలా మీడియాలో ఉండేలా రష్మిక ప్లాన్స్ ఉంటున్నాయి. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ గ్లామర్ ఫొటోస్ ని షేర్ చేసే రష్మికకి బాలీవుడ్ లోనూ ఆఫర్లు అందుకుంటుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here