ఏంటి?.. మృణాల్ ఠాకూర్ పెళ్ళా… పెళ్లికోడుకు ఎవరు?

- Advertisement -

సీతారామం సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. మొదటి సినిమా సక్సెస్ అవ్వడం తో అమ్మడు క్రేజ్ బాగా పెరిగిపోయింది.. సినిమాలో పద్దతిగా కనిపించిన సీత బయట బాగా హాట్ గా కనిపించి యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది.. రోజూ రోజుకు గ్లామర్ డోస్ ను పెంచుతుంది.. బికినీ అందాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంది.. తాజాగా పెళ్లి కూతురు గెటప్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది.. అవి కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.. ఈ ఫోటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ ఏంటి పెళ్ళా అంటూ కామెంట్లు పెడుతున్నారు..

మృణాల్ ఠాకూర్
మృణాల్ ఠాకూర్

సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. నార్త్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు అమ్మాయిలాగా ఆమె చీర, లంగాఓణీలో మైమరపించింది.. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో భారీ ఆఫర్స్ అందుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్టార్ హీరోల చిత్రాలకు ఆమె ఛాయిస్ గా మారుతోంది. అంతలా సీతా రామం చిత్రంలో ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది ఈ యంగ్ బ్యూటీ…తన అందం, అభినయంతో జనాలను ఫిదా చేసింది..

మరొక్క హిట్ కొడితే మృణాల్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా మారిపోవడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు. నటన పూర్తిగా రాకున్నా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్న చాలా మంది హీరోయిన్లకు మృణాల్ ఠాకూర్ బిగ్ థ్రెట్ అని అంటున్నారు.. ఇది ఇక ఉండగా తాజాగా మృణాల్ ఠాకూర్ షేర్ చేసిన పిక్స్ నెట్టింట దూసుకుపోతున్నాయి.

- Advertisement -

చాలా రోజుల తర్వాత మృణాల్ ఠాకూర్ ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించడం తో నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు..పెళ్ళికూతురిలా నిండైన చీరలో, ఒంటినిండా ఆభరణాలతో మృణాల్ మురిపిస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. సీతా రామం చిత్రంతో మృణాల్ ఠాకూర్ కి హోమ్లీ ఇమేజ్ దక్కింది.. దీన్ని చూసిన వారంతా.. ఏంటి?.. మృణాల్ ఠాకూర్ పెళ్ళా.. పెళ్లికోడుకు ఎవరో మరి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.. అసలు విషయం ఏంటో తెలియాల్సి ఉంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here