Disha Patani మతిపోగొడుతున్న దిశా పటానీ లేటెస్ట్ పిక్స్



తమ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేసే హిరోయిన్ల జాబితాలో Disha Patani దిశా పటానీ టాప్ లో ఉంటుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె రేపే వేడి అంతా ఇంతా కాదు. పొట్టి డ్రెస్సులలో తన అందాలతో యువతను ఉర్రూతలూగిస్తుంది. దిశా పటాని అందాల ఆరబోత రోజు రోజుకి మరీ ఎక్కువవుతోంది. తాజాగా ఓ కంపెనీ ప్రమోషన్ లో భాగంగా ఆమె పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. కళ్ళు చెదిరే ఫోజులతో, ఎక్స్ ప్రెషన్స్ తో మరింత అంత అందాన్ని ఆరబోస్తే కుర్రకారులు తట్టుకోవడం కష్టమే. ఆమె నడుము అందాలకు తెలుగు యాంకర్ విష్ణు ప్రియ కూడా ఫిదా అయింది. అలాంటి నడుమే నాకు కావాలి అంటూ కామెంట్స్ పెట్టడం విశేషం.

Disha Patani
Disha Patani

దిశా పటానిని పూరి జగన్నాథ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. తొలి చిత్రం లోఫర్ తో హీరోయిన్ గా పరిచయం అయింది దిశా. సినిమా హిట్ కాకున్నా.. ఆ చిత్రంలో ఆమె అందాల విందుకు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. తర్వాత దిశా పటాని బాలీవుడ్ కి పయనమైంది. మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు. కానీ తన మత్తెక్కించే అందాలతో తెలుగు ప్రేక్షకులకు మాత్రం దగ్గరయింది. దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ సంపాదించింది. నటన కంటే ఎక్కువగా గ్లామర్ తోనే గుర్తింపు సొంతం చేసుకుంది.

దిశా పటాని, టైగర్ ష్రాఫ్ జంట గత కొన్నేళ్లుగా ఈ జంట ప్రేమలో మునిగితేలుతున్నారు. తాజాగా వీరి మధ్య బ్రేకప్ జరిగినట్లు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. టైగర్ ఫ్యామిలీతో దిశాకు మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. కానీ సడెన్ గా వీరిద్దరూ విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ జంట పెళ్లి పీటల వరకు వెళుతుందా లేక ఇలా ప్రేమతోనే కాలం గడిపేస్తారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే మరో వ్యక్తితో దిశా పటాని కొత్త ప్రేమ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దిశా పటాని.. ఏక్ విలన్ 2, సూర్య 42, ప్రభాస్ ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తోంది. సెలెబ్రిటీల విడాకులు ఈ మధ్య సాధారణ విషయంగా మారిపోయాయి.  సానియా మీర్జా విడాకులకు సిద్దమైనట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి.