‘రంజిదమే’ ట్రెండ్‌ నడుస్తోంది గురూ..సోషల్‌ మీడియాలో నిత్యం ఏదో ఒక సాంగ్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా ఖండాలు కూడా దాటుతాయి పాటలు. ఒక్కోసారి ఒక్కో పాట ట్రెండ్ నడుస్తుంటుంది. సోషల్‌ మీడియాను షేక్ చేస్తుంది. ప్రస్తుతం ‘రంజిదమే’ ట్రెండ్‌ నడుస్తోంది. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న విజయ్‌ , రష్మిక జంటగా నటించిన సినిమా ‘వారిసు’ (వారసుడు) లోనిది ఈ పాట. ఇటీవల విడుదలైన ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో 2 కోట్లకుపైగా వ్యూస్‌ సొంతం చేసుకోగా.. విజయ్‌, రష్మికల స్టెప్పులకు ఫిదా అయిన కొందరు వీరిలానే స్టెప్పులు వేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.. గతంలో ‘బుట్టబొమ్మ’ (అలా వైకుంఠపురంలో) ‘అరబిక్‌ కుతు’ (బీస్ట్‌), ‘నాటు నాటు’ (ఆర్‌ఆర్‌ఆర్‌), ‘రారా రక్కమ్మ’ (విక్రాంత్‌ రోణ) ఊ అంటావా ఉఊ అంటావా (పుష్ప) తదితర పాటలు వైరల్ అయిన విషయం తెలిసిందే.