Rana Daggubati మహేష్ బాబు కి అంత సీన్ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో రానా దగ్గుపాటి

- Advertisement -

Rana Daggubati విక్టరీ వెంకటేష్ – దగ్గుపాటి రానా కాంబినేషన్ లో ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ విడుదలకు మాత్రం నోచుకోలేదు.ఎట్టకేలకు ఈ సిరీస్ మార్చి 10 వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.ఇప్పటికే ఈ సిరీస్ కి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ కి ఫ్యాన్స్ నుండి అదిరిపొయ్యే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.ట్రైలర్ మొత్తం బోల్డ్ కంటెంట్ తో బూతులతో నింపేశారు.

Rana Daggubati
Rana Daggubati

ఫ్యామిలీ ఆడియన్స్ తో చూడదగాని సిరీస్ కాకపోయినప్పటికీ యూత్ కి కచ్చితంగా కనెక్ట్ అయ్యే సిరీస్ అని మాత్రం అర్థం అవుతుంది.అయితే ఈ సిరీస్ ప్రొమోషన్స్ కోసం దగ్గుపాటి రానా పలు ఇంటర్వూస్ ఇచ్చాడు.తెలుగు కంటే కూడా ఆయన ప్రొమోషన్స్ విషయం లో హిందీ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు.ఈ సందర్భంగా ఒక ప్రముఖ మీడియా ఛానల్ తో టాలీవుడ్ హీరోల గురించి ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Actor Venkatesh
Actor Venkatesh

ఆయన మాట్లాడుతూ ‘ఇప్పుడంటే మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము లేపేస్తున్నాయి.కానీ ఒకప్పుడు మన టాలీవుడ్ హీరోలు అక్కడి వాళ్లకి తెలిసేది కాదు..నేను మన తెలుగు హీరోల పేర్లు చదివితే ఎవరు వాళ్ళు అనేటోళ్లు.నాకు సంబంధించిన ఒక స్నేహితుడికి ప్రభాస్ అంటే ఎవరో బాహుబలి ముందు తెలియదు.ఎందుకంటే అతని సినిమాలు నేనేమి చూడలేదు అని చెప్పేవాడు, ఇక మహేష్ బాబు గురించి అడిగితే ‘చిన్నూ భర్త కదా..తెలుసు’ అని అనేవాడు.చిన్నూ అంటే నమ్రత శిరోద్కర్.అక్కడ కేవలం మహేష్ బాబు అంటే నమ్రత గారి భర్త గా మాత్రమే తెలుసు, ఆయన ఏమి సినిమాలు చేసాడో , ఎలాంటి సినిమాలు చేసాడో తెలియదు.అప్పుడే నేను చెప్పను రాబొయ్యే రోజుల్లో మా టాలీవుడ్ హీరోలు మీ బాలీవుడ్ ని కబ్జా చేసేస్తారని.ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది, మన సినిమాలు ఇక్కడ దుమ్ము లేపడాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది’ అంటూ రానా ఈ సందర్భంగా మాట్లాడాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here