నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు. ఆరు పదుల వయసు వచ్చినా కూడా ఇప్పటికీ కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలలో నటిస్తూ వస్తున్నారు. అలాంటి బాలకృష్ణ సరసన హీరోయిన్గా ఛాన్స్ వస్తే కుర్ర హీరోయిన్లు అయినా సరే ఓకే చెబుతారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం బాలకృష్ణతో నటించడానికి నో చెప్పిందట. మరి దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాలయ్య- వినాయక్ కాంబోలో వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్యకు జంటగా టబు, శ్రియా నటించారు. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. 2002లో అప్పుడు చిరంజీవి ఇంద్ర సినిమాకు పోటీగా వచ్చిన ఈ సినిమా 42 కేంద్రాల్లో 100 రోజులు ఆడి సెన్షేషనల్ విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో బాలయ్యకు జంటగా ముందుగా టబు ప్లేస్ లో స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణని అనుకున్నారట. అప్పటికే ఆమె సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఉన్నారు.
ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఉన్న సమయంలో హీరోకి తల్లి పాత్రలో నటిస్తే తన కెరియర్ పై తీవ్రమైన ప్రభావం పడుతుందన్న కారణంతోనే రమ్యకృష్ణ బాలకృష్ణతో కలిసి తాను చేయనని కరాకండిగా చెప్పేసారట.ఇలా రమ్యకృష్ణ చేయనని చెప్పడంతోనే రమ్యకృష్ణ స్థానంలో నటి టబును తీసుకున్నారు. ఇక ఈ సినిమా విడుదల అయ్యి అప్పట్లో సంచలనాలను సృష్టించిన విషయం మనకు తెలిసిందే.