వామ్మో రామ్ చరణ్ రచ్చ మాములుగా లేదుగా.. ఒక్క పాట కోసం ఏకంగా రూ.100 కోట్లా..

- Advertisement -

శంకర్ సినిమా అంటే కథా కథనాలతో పాటు పాటలకు స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవరూ ఊహించని థీమ్స్‌ గ్రాండియర్‌తో నెవ్వర్ బిఫోర్ అన్న రేంజ్‌లో పాటలు ప్లాన్ చేస్తున్నారు శంకర్‌. ఇప్పుడు గేమ్ చేంజర్‌ విషయంలోనూ అదే జరుగుతోంది. భారీ సినిమాకు పెట్టే బడ్జెట్‌ కన్నా ఈ సినిమా పాటలకు పెడుతున్న ఖర్చే ఎక్కువట. రామ్ చరణ్ హీరోగా గ్రేట్‌ డైరెక్టర్ శంకర్‌ రూపొందిస్తున్న భారీ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ గేమ్ చేంజర్‌. శంకర్‌ మార్క్‌ గ్రాండియర్‌తో రూపొందుతున్న ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు మేకర్స్‌.

రామ్ చరణ్
రామ్ చరణ్

ముఖ్యంగా పాటల విషయంలో శంకర్‌ తన గత చిత్రాలను మరిపించేలా ప్లాన్ చేస్తున్నారట.శంకర్ సినిమా అంటే పాటలకు చాలా స్పెషాలిటీ ఉంటుంది. సినిమా థీమ్‌తో సంబంధం లేకుండా భారీ సెట్స్‌లో లావిష్‌గా సాంగ్స్‌ షూట్‌ చేయటం శంకర్ స్టైల్‌.హీరో ఎవరైన శంకర్‌ సినిమా సాంగ్‌ అంటే… మరో ప్రపంచంలో విహరించిన ఫీలింగ్ కలుగుతుంది. గేమ్ చేంజర్‌ సినిమాలో జస్ట్ సాంగ్స్ కోసమే 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట శంకర్‌. అంతలా శంకర్ తన సినిమాల్లో పాటలను రిచ్‌ లెవల్లో చూపించాలని ఫిక్స్ అయ్యాడు. ఐదు పాటల కోసం ఐదుగురు టాప్ కొరియోగ్రాఫర్స్‌ను తీసుకున్న మేకర్స్‌.. వాళ్లను అసిస్ట్ చేయడానికి కూడా ఫామ్‌లో ఉన్న కొరియోగ్రాఫర్స్‌ను హైర్ చేశారు.

అందుకే పాటల బడ్జెటే ఓ సినిమా రేంజ్‌కు చేరింది.ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి 5 పాటల షూటింగ్ పూర్తయ్యింది. టాకీ కూడా 80 శాతం వరకు కంప్లీట్ అయ్యింది. త్వరలోనే షూటింగ్ రీ స్టార్ట్ చేసి ఈ ఏడాది చివర కల్లా వ్రాపప్‌ చెప్పేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట తెగ హల్‌ చల్‌ చేస్తుంది. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ రెండు విభిన్న గెట‌ప్‌ల‌లో క‌నిపించ‌నున్నాడు. ఇప్ప‌టికే సినిమా నుండి లీకైన చ‌ర‌ణ్ ఫోటోల‌కు విశేష స్పంద‌న వ‌చ్చింది. రామ్‌చరణ్‌కు జోడీగా కియరా అద్వాని, అంజలిలు నటిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here