Ram Charan : తెలుగు సినిమా ఇండస్ట్రీ తలరాతని మార్చేసిన సినిమా బాహుబలి. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సునామి లాంటి వసూళ్లను రాబట్టి, మేకింగ్ విషయం లో మన తెలుగు సినిమాకి హాలీవుడ్ స్థాయి ఉందని నిరూపించిన చిత్రమిది. ఈ సినిమా తర్వాత మన ఇండియాలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. కానీ ఒక్క సినిమా కూడా బాహుబలి 2 వసూళ్లకు దరిదాపుల్లో కూడా వెళ్లలేకపోయాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఆ సినిమా సృష్టించిన సునామీ ఎలాంటిదో.
ఈ చిత్రం తర్వాత మన తెలుగు సినిమాకి పాన్ ఇండియా లెవెల్ లో మార్కెట్ మొదలైంది. చిన్న హీరోల దగ్గర నుండి పెద్ద హీరోల వరకు ప్రతీ ఒక్కరు తమ సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసుకోవడం మొదలు పెట్టారు. అయితే ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం ఎవరు అంటే రాజమౌళి, ప్రభాస్ పేర్లు చెప్తారు ప్రతీ ఒక్కరు.
కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ ని గుర్తించి క్రెడిట్ ఇచ్చాడు. రీసెంట్ గా ఆయన క్యాలిఫోర్నియా లో జరిగిన ఫిలిం ఫెస్టివల్ ఈవెంట్ కి ఒక అతిథిగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో ఆయన బాహుబలి గురించి మాట్లాడుతూ ‘రాజమౌళి గారు తీసిన బాహుబలి చిత్రం పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యి రాజమౌళి కి, మా డార్లింగ్ ప్రభాస్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఆ సినిమాని బాలీవుడ్ లో మార్కెటింగ్ చేసి భారీ స్థాయిలో విడుదల ఇచ్చింది కరణ్ జోహార్ గారు. ఆయన ఆ సినిమాని అంతలా ప్రమోట్ చేసి, జనాల్లోకి తీసుకెళ్లారు కాబట్టే బాహుబలి చిత్రం అత్యధిక మందికి రీచ్ అయ్యింది. కాబట్టి ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ లో కరణ్ జోహార్ గారిది కూడా ప్రధాన భాగం. బాలీవుడ్ కి చెందిన వాడు అయినప్పటికీ ఒక తెలుగు సినిమాని ఆయన ప్రమోట్ చేసాడు’ అంటూ రామ్ చరణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.