Allu Arjun : పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప సినిమా సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు ఈ సినిమాకి కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలోని అల్లు అర్జున్ స్టైల్, మ్యానరిజమ్స్ మనం రోజు అనుసరించి వాటిల్లో ఒక భాగం అయిపోయింది. అలాంటి సినిమాకి సీక్వెల్ అంటే ఏ రేంజ్ లో ఉండాలో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు అనుకుంట. డైరెక్టర్ సుకుమార్ అదే రేంజ్ లో ఈ సినిమాని తీసేందుకు ఎక్కడా కూడా తగ్గడం లేదు. కానీ ఆయన మొండిపట్టుదల కారణంగా ఒక సాధారణ కమర్షియల్ విలువలు ఉన్న పుష్ప చిత్రానికి దాదాపుగా 900 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ అయ్యిందట. సుకుమార్ పద్దతి, ఆయన మేకింగ్ స్టైల్ పట్ల అల్లు అర్జున్ కూడా తీవ్రమైన అసహనం తో ఉన్నట్టు తెలుస్తుంది.
ఆ కోపంతోనే అల్లు అర్జున్ పుష్ప కోసం ఎంతో కాలం నుండి మైంటైన్ చేస్తున్న గెటప్ ని తీసేసి, విదేశాలకు వెళ్లాడని, ఇక పుష్ప చిత్రం లో నటించబోనని మొండికేస్తే నిర్మాతలు ఆయనతో చర్చలు జరిపి ఎట్టకేలకు షూటింగ్ లో అల్లు అర్జున్ ని పాల్గొనేలా చేసారని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్. పూర్తి వివరాల్లోకి వెళ్తే సుకుమార్ తీసిన సన్నివేశాలని మళ్ళీ మళ్ళీ తీస్తూ అల్లు అర్జున్ కి, నిర్మాతలకు చిరాకు రప్పించాడట. ఉదాహరణకి ఈ సినిమాకి సంబంధించిన మాల్దీవ్స్ సెట్ ని వైజాగ్ లో వేసి కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారట. అయితే ఆ సన్నివేశాల ఫైనల్ ఔట్పుట్ ని చూసిన తర్వాత సుకుమార్ ఎందుకో నచ్చలేదట. దీంతో షూటింగ్ చేసిన ఆ సన్నివేశాలన్నీ పక్కన పెట్టి, మాల్దీవ్స్ కి వెళ్లి షూటింగ్ చేద్దామని నిర్మాతలతో అన్నాడట. అలా ప్రతీ సన్నివేశానికి నాలుగైదు వెర్షన్లు షూట్ చేసి తనకి ఏది బెస్ట్ అనిపిస్తే అది తీసుకుంటున్నాడట.
దీనివల్ల 10 కోట్ల రూపాయలతో తియ్యాల్సిన సన్నివేశానికి వంద కోట్లు ఖర్చు అవుతుందట. మరోపక్క షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో విడుదల తేదీలను వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆగష్టు 15 వ తారీఖు నుండి ఈ సినిమాని డిసెంబర్ 6 కి వాయిదా వేసినందుకు నిర్మాతలకు 60 కోట్ల రూపాయిల వడ్డీ కట్టుకోవాల్సి వచ్చిందట. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక ని గర్భవతి గా చూపించేందుకు దాదాపుగా 15 లక్షల రూపాయిలు ఖర్చు చేయించాడట సుకుమార్. ఇలా సినిమా షూటింగ్ ని సాగదియ్యడం వల్ల ఇంకా బోలెడంత షూటింగ్ పెండింగ్ లో పడిపోయింది. అందుకే అల్లు అర్జున్ అసహనం ని వ్యక్తం చేసాడు. అప్పటి నుండి ఈ సినిమా షూటింగ్ రెండు యూనిట్స్ తో షూట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి నిర్మాతలు ప్రకటించినట్టుగా ఈ సినిమా డిసెంబర్ 6 న విడుదల అవుతుందో లేదో చూడాలి.