Naga Ashwin మహాభారతం బ్యాక్ డ్రాప్ తో సైన్స్ ఫిక్షన్ జోడించి నాగ అశ్విన్ తీసిన ‘కల్కి’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చి ప్రభాస్ కెరీర్ లో రెండవ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ సాధించిన సినిమాగా దూసుకుపోతునం సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే 700 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా ఈ వీకెండ్ తో వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని కూడా అందుకోనుంది. సినిమా ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో నాగఅశ్విన్ నేడు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన విలేఖరులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాదానాలు చెప్పాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో కర్ణుడి పాత్ర ప్రభాస్, అర్జునుడి పాత్ర విజయ్ దేవరకొండ, అశ్వథామ పాత్ర అమితాబ్ బచ్చన్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే.
కానీ కృష్ణుడి పాత్ర ఎవరు చేసారు అనే సస్పెన్స్ మాత్రం అలాగే ఉంచేసాడు డైరెక్టర్ నాగ అశ్విన్. కానీ ఈ పాత్ర సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తే చాలా బాగుంటుంది అని ఆయన అభిమానుల తో పాటు, ఇతర హీరోల అభిమానులు కూడా సోషల్ మీడియా లో పోస్టింగ్స్ పెడుతున్నారు. ఇదే ప్రస్తావన ఒక విలేఖరి తీసుకొచ్చి, కృష్ణుడి పాత్ర మహేష్ బాబు తో చేయించొచ్చు కదా అని అడగగా, దానికి నాగ అశ్విన్ సమాధానం చెప్తూ, మా సినిమాలో అవకాశం లేదు, వేరే ఏదైనా సినిమాలో ఆయన కృష్ణుడి పాత్ర చేస్తే బాగుంటుంది అని అంటాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. మా అభిమాన హీరోని అంత మాట అంటావా అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ నాగ అశ్విన్ పై తీవ్రముగా విరుచుకుపడుతున్నారు.
ఒక్క రెండు హిట్లు రాగానే తల పొగరు బాగా పెరిగిపోయింది అంటూ మండిపడుతున్నారు. ఇది ఇలా ఉండగా తరువాయి భాగం లో కల్కి ఎవరో చూపిస్తారా అని విలేఖరి అడిగిన ప్రశ్నకి నాగ అశ్విన్ సమాధానం చెప్తూ ‘ప్రస్తుతానికి సస్పెన్స్’ అని అన్నాడు. ఈ క్యారక్టర్ ఒక్క పెద్ద స్టార్ హీరో చేస్తాడని, ఆయన మరెవరో కాదు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే రెండవ భాగం పూర్తై 60 శాతం అయ్యిందని ఆ చిత్ర నిర్మాత అశ్విని దత్ చెప్పుకొచ్చారు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట.