Ram Charan : రామ్ చ‌ర‌ణ్‌తో సెల్ఫీ కోసం అభిమాని క‌న్నీళ్ళు…. మంచి మనసు చాటుకున్న చెర్రీ

- Advertisement -

Ram Charan: సినీ సెలబ్రిటీలు బయట ఎక్కడైనా కనిపిస్తే చాలు వెంటనే వాళ్ళని కలిసి సెల్ఫీలు, ఫోటోలు దిగడానికి ఫ్యాన్స్ ఏగబడుతుంటారు.. కొన్ని భద్రతా కారణాల వల్ల ఫ్యాన్స్ ని దగ్గరకు రానివ్వకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటారు.. ఇప్పుడు అలాగే ఒక అభిమాని తన కోసం వచ్చి ఎదురు చూస్తున్నాడాని తెలుసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏం చేశాడో చూడండి ఓ వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది నెట్టింట చక్కర్లు కొడుతోంది..

Ram Charan
Ram charan

మెగా ఫ్యామిలీ నుంచి అడుగు పెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేకమైన క్రియేట్ చేసుకున్నాడు. అతి కొద్ది కాలంలోనే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అనూహ్యమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. అలాంటి చెర్రీ తో ఒక్క సెల్ఫీ దిగాలని ఎంతో మంది అభిమానుల కల.. రామ్ చరణ్ బయటకు వెళ్తే చాలు..

తనతో కలిసి సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడుతుంటారు.. రామ్ చరణ్ కూడా ఎంతో ఓపికగా ఫ్యాన్స్ తో ఫోటోలు దిగుతారు.. అయితే కొన్నిసార్లు భద్రతా కారణాలతో ఫాన్స్ ను దగ్గరకు రానీయకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుపడతారు. తాజాగా రామ్ చరణ్ అభిమానికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది..

- Advertisement -
Ram Charan

ఓ బాలుడికి మెగా పవర్ స్టార్ అంటే విపరీతమైన అభిమానం.. ఎప్పటికైనా తన అభిమాన హీరోను కలవాలని కలిసి ఓ ఫోటో దిగాలని అనుకున్నాడు. అయితే రామ్ చరణ్ తన సమీపంలోని ఓ ఏరియాలో ఉన్నాడని తెలుసుకొని ఆ బాలుడు చకచకా అక్కడికి వెళ్ళిపోయాడు.. సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుంటూ రామ్ చరణ్ దగ్గరకు వెళ్ళాడు..

అయితే చెర్రీని కలిసే క్షణం రాగానే సెక్యూరిటీ సిబ్బంది గమనించి అతనిని అడ్డుకున్నారు. మెగా పవర్ స్టార్ దగ్గరకు వెళ్ళనివ్వలేదు ఆ కుర్రాడిని.. దాంతో ఆ బాలుడు కన్నీటి పర్యంతమయ్యాడు. అది గమనించిన రామ్ చరణ్ సెక్యూరిటీ సిబ్బందిని అతనిని తన దగ్గరికి పంపించమని చెప్పాడు..

ఆ బాలుడిని తన దగ్గరకు రాగానే కలిసి ఫోటో దిగుదామని చెప్పాడు. అలా చెర్రీతో కలిసి ఫోటో దిగుతున్న సమయంలో ఆ బాలుడు భావోద్వేగానికి గురయ్యాడు.. కంటే తడి పెట్టుకున్నాడు. దాంతో చెర్రీ ఆ బాలుడిని ఓదార్చాడు. ఏడవద్దని చెప్పాడు. తన అభిమాన హీరో స్వయంగా చెప్పడంతో ఆ బాలుడు కళ్ళు తుడుచుకొని..

సంతోషంగా ఫోటో దిగి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ రామ్ చరణ్ మంచి మనసు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎదుటివారి మంచి మనసును అర్థం చేసుకోవడంలో రామ్ చరణ్ మించిపోయాడని చెప్పుకోవాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here