Sree Leela స్కూబా డైవింగ్.. బాగానే ఎంజాయ్ చేస్తున్నావ్‌గా.!

- Advertisement -

Sree Leela : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.. దాంతో హీరో హీరోయిన్స్ చైల్డ్ హుడ్, త్రో బ్యాక్, వెకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఓ గ్లామరస్ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ ఓ స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.? అంటూ ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు..

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నది చేసింది కొన్ని సినిమాలు అయినప్పటికీ హీరోయిన్ స్టార్ హీరోయిన్ క్రేజ్ అందుకుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో వెండితెరకు పరిచయమైంది శ్రీ లీల.. పైనున్న ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ శ్రీ లీల.. స్విమ్మింగ్ చేస్తున్న శ్రీ లీల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా అంటూ సాగర కన్యను తలపిస్తున్న ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు.

Sree Leela

ఈ సినిమాతో తన అందం అభినయంతో పాటు డాన్స్ తో కూడా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.. దాంతో ఈ అమ్మడికి వరుస సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి.. మహారాజా రవితేజ తో కలిసి ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.. అంతేకాదు రవితేజ కెరియర్ లో 100 కోట్ల బాక్సాఫీస్ కుంభకోణాన్ని కూడా బదులు కొట్టాడు. దాంతో ఈ అమ్మడిని బాక్స్ ఆఫీస్ దేవతగా కొలిచేస్తూ వరుస ఆఫర్స్ ఇస్తున్నారు డైరెక్టర్స్.

- Advertisement -

ప్రస్తుతం శ్రీలీలా చేతిలో అరడజనుకుపైగా సినిమాలో ఉన్నాయి. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న హ్యాట్రిక్ సినిమాలో ఈ అమ్మడు సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో శ్రీ లీల కూతురిగా నటిస్తుంది. అలాగే నితిన్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. ఇంకా రామ్ పోతినేని నెక్స్ట్ సినిమాలో శ్రీ లీల జోడిగా నటించనుంది. దీంతో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోల సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here