Ram Charan #RC16 : కాళ్లు లేని, కబడ్డీ ప్లేయర్ రామ్ చరణ్ డ్యూయల్ రోల్.. బుచ్చిబాబు సినిమా స్టోరీ లీక్..?

- Advertisement -

Ram Charan #RC16 : గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ ఇప్పుడు వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీగా ఉన్నాడు..ఇటీవలే త్రిపుల్ ఆర్ సినిమా సినిమాకు ఆస్కార్ అందుకున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యనున్న విషయం తెలిసిందే..గేమ్ ఛేంజెర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రం ఇదే.

Ram Charan #RC16
Ram Charan #RC16

శంకర్ మరోవైపు కమల్ హాసన్ ఇండియన్ 2 తో బిజీగా ఉండడం వల్ల రాంచరణ్ మూవీ ఆలస్యం అవుతోంది.. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎన్నో సీన్లు లీక్ అయ్యాయి.. అయితే ఇప్పుడు చెర్రి ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు..బుచ్చి బాబు కథ నచ్చడంతో రామ్ చరణ్ ఒకే చెప్పారు.. అయితే ఈ సినిమాపై ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Ram Charan

ఈ సినిమాకు లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారని ప్రచారాలు జరుగుతున్నాయి.. అంతేకాదు ఈ సినిమాకు హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను సెలెక్ట్ చేసినట్లు టాలివుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతుంది.. ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమాలో చెర్రి డ్యూయల్ రోల్ చేస్తున్నారని తెలుస్తుంది.. ఈ చిత్రాన్ని బుచ్చిబాబు 1980నేపథ్యంలో రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించనున్నారు.. కబడ్డీ నేపథ్యంలో సినిమా రాబోతుందని టాక్ వినిపిస్తుంది.. కాళ్లు లేని అన్న, అలాగే అన్న కోరిక తీర్చే తమ్ముడు కబడ్డీ ప్లేయర్ పాత్రలో రామ్ చరణ్ కనిపించునున్నారు..

- Advertisement -
Ram Charan

రాంచరణ్ కూడా ఇటీవల జాతీయ మీడియా సమావేశంలో బుచ్చిబాబు చిత్రం గురించి చాలా ఎగ్జైట్ అవుతూ మాట్లాడారు. రంగస్థలం తర్వాత తన కెరీర్ లో మరో గొప్ప చిత్రం అయ్యే కథ ఇది అని తెలిపారు. సుకుమార్ రంగస్థలం చిత్రంలో చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా నటించాడు. బుచ్చిబాబు ఉప్పెనలో హీరో పాత్రకి చివర్లో ఒక లోపం ఎమోషనల్ గా బయట పడుతుంది.. ఇక చరణ్ సినిమాలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు బుచ్చిబాబు..కానీ ఈ స్టోరీ పై చరణ్ ఫ్యాన్స్ మాత్రం పెదవిరుస్తున్నారు.. తన హీరో రేంజ్ స్టోరీ కాదని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి సినిమా అసలు కథ ఏంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here