Orange రీ రిలీజ్ క్లోసింగ్ కలెక్షన్స్..ఆల్ టైం సెన్సేషనల్ రికార్డ్

- Advertisement -

Orange మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 26 వ తారీఖున ‘ఆరెంజ్’ సినిమాని రీ రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన ఈ సినిమాని రీ రిలీజ్ చెయ్యడం పై సోషల్ మీడియా లో ఎన్నో సెటైర్లు వచ్చాయి.కానీ ఎవ్వరూ కలలో కూడా ఊహించని విధంగా ఈ సినిమాకి రీ రిలీజ్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Orange
Orange

కేవలం మొదటి రోజు మాత్రమే కాదు, రెండవ రోజు , మూడవ రోజు మరియు నాల్గవ రోజు కూడా ఈ చిత్రానికి హౌస్ ఫుల్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి అంటే రామ్ చరణ్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.థియేటర్స్ మొత్తం మ్యూజికల్ కన్సర్ట్స్ గా మారిపోయాయి.ఆ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

ram

మొదటి రోజే ఈ చిత్రానికి సుమారుగా కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి,అదే ఊపుని రెండవ రోజు కూడా విజయవంతంగా కొనసాగించింది.అక్కడి తో కూడా ఈ చిత్రం ఆగిపోలేదు,అదే ఫ్లో ని వారం మొత్తం కొనసాగించింది.న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’ చిత్రం విడుదల ముందు వరకు కూడా ఈ చిత్రానికి హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతూనే ఉన్నాయి.ఎట్టకేలకు ఈ సినిమా రన్ నేటితో పూతి అయ్యింది.

- Advertisement -
jenilia

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు మూడు కోట్ల పది లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని.ఇది రీ రిలీజ్ అయినా సినిమాలలో ఆల్ టైం టాప్ 3 హైయెస్ట్ గ్రాస్ అని చెప్పుకొచ్చారు ట్రేడ్ పండితులు.మొదటి రెండు సినిమాలు పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఖుషి మరియు జల్సా సినిమాలు ఉన్నాయి.ఒక డిజాస్టర్ సినిమాకి ఆల్ టైం టాప్ 3 స్థానం దక్కిందంటే సాధారణమైన విషయం కాదంటున్నారు విశ్లేషకులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here