Ram Charan : రామ్ చరణ్ కు డాక్టరేట్.. తర్వాత ఆ హీరోకేనా..!

- Advertisement -

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు నేషనల్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు. RRR తో వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ సినిమా, ఆ తర్వాత సుకుమార్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రకాలుగా ప్రఖ్యాత కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు సంపాదించుకున్నారు చరణ్. ఇప్పుడు రామ్ చరణ్ కి ఏకంగా డాక్టరేట్ ప్రకటించింది ఓ ప్రముఖ యూనివర్సిటీ.

 

- Advertisement -

తమిళనాడు చెన్నైకి చెందిన వేల్స్‌ యూనివర్సిటీ రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 13న ఈ యూనివర్సిటీలో జరగనున్న స్నాతకోత్సవ కార్యక్రమానికి రామ్‌ చరణ్‌ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. చరణ్ తో పాటు పలువురు తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు కూడా రాబోతున్నట్టు సమాచారం. ఆ రోజున ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అధ్యక్షుడు డీజీ సీతారాం చేతుల మీదుగా చరణ్ ఈ డాక్టరేట్ అందుకుంటారని సమాచారం.

కళారంగానికి చరణ్ చేసిన సేవలకు గాను ఈ డాక్టరేట్ ప్రదానం చేయబోతున్నట్టు యూనివర్సిటీ వెల్లడించింది. దీంతో చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ కి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తర్వాత అల్లు అర్జున్, ఎన్టీఆర్ లకు వస్తుందని అనుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here