Raashi Khanna : గ్రే సూట్​లో రాశీఖన్నా రావిషింగ్ లుక్స్.. బాయ్​ఫ్రెండ్ డ్రెస్ అంటూ పోస్ట్

- Advertisement -

Raashi Khanna : టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా సోషల్ మీడియాలో మరోసారి సొగసుల బాంబ్ విసిరింది. ఈ భామ రచ్చ చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఈ బ్యూటీ ఔట్​ఫిట్ కంటే ఎక్కువగా ఆ ఫొటోల కింద తను ఇచ్చిన క్యాప్షన్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. బాయ్​ఫ్రెండ్ క్లోజెట్ నుంచి తీసుకున్నాను.. ట్రెండీగా కనిపించాలని అంటూ క్యాప్షన్ యాడ్ చేసింది. ఈ క్యాప్షన్ చూసి నెటిజన్లు అదేంటి.. రాశీకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటూ తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు. రాశీ ఖన్నా బాయ్ ఫ్రెండ్ అంటూ గూగుల్​లో తెగ వెతికేస్తున్నారు. కానీ ఎవరూ లేరని తెలిసి చివరకు కూల్ అవుతున్నారు.

Raashi Khanna
Raashi Khanna

క్లాసీ లుక్​లో ఫొటోలు పోస్ట్ చేసిన రాశీ ఖన్నా అబ్బాయిలు ధరించేటువంటి సూట్​ వేసుకుంది. అందుకే బాయ్ ఫ్రెండ్ డ్రెస్ వేసుకున్నా అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ జత చేసింది. కానీ ఈ క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు తెర తీసింది. రాశీ ఖన్నా మాత్రం తన లైఫ్​లో ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క లవ్.. సినిమాలు అంటూ ఈ రూమర్స్​కు స్మైల్​తో చెక్ పెట్టేస్తుంది. ఇక ఈ లుక్​లో మాత్రం రాశీ సూపర్ క్లాసీగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

ఇక రాశీ ఖన్నా సినిమాల సంగతికి వస్తే ఈ బ్యూటీ ఇటీవలే యోధ సినిమాతో బాలీవుడ్​ ప్రేక్షకలను అలరించింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ది సబర్మతి రిపోర్ట్, తెలుసు కదా, సర్దార్-2 సినిమాలు ఉన్నాయి. ఈ భామ తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లోనూ చాలా బిజీ అయిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్​లో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. తెలుగులో చివరగా థాంక్యూ సినిమాతో అలరించింది.

 

View this post on Instagram

 

A post shared by Raashii Khanna (@raashiikhanna)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here