Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం భారత దేశ దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లో రామ్ చరణ్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన డ్యుయల్ రోల్ పోషిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత అంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఛేంజర్. పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ మూడడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా నడుస్తోంది.

వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది అని వార్తలు వస్తున్నప్పటికీ అది డౌటే. ఈ సినిమా విడుదల తేదీ గురించి ఎలాంటి క్లారిటీ లేదు. అసలు సినిమా ఎంత వరకు షూటింగ్ కంప్లీట్ అయిందన్న అప్డేట్స్ ఈ మధ్య వినిపించడం లేదు. దీంతో ఫ్యాన్స్ దర్శక నిర్మాతలపై కోపంగా ఉన్నారు. ఇప్పట్లో కాదు 2025 సంక్రాంతికే వస్తుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది.

అయితే మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఓపిక నశించిన ఓ రామ్ చరణ్ అభిమాని ఏకంగా ప్రొడ్యూసర్ దిల్ రాజు పేరుతో ఓ సూసైడ్ లెటర్ రాశాడు. ఇందులో ఏముందంటే.. ఇన్ని రోజులు ఈ సినిమా అప్డేట్స్ కోసం చాలా ఓపికగా ఎదురు చూశాను. దురదృష్టవశాత్తు ప్రొడక్షన్ టీం నుంచి ఎలాంటి అప్ డేట్స్ అందడం లేదు. నేను ప్రొడక్షన్ టీంకి మూడు రోజులు టైం ఇస్తున్నాను. ఇంతలో సినిమా రిలీజ్ డేట్ అప్డేట్ ఇవ్వాలి లేకపోతే సూసైడ్ చేసుకొని చస్తానంటూ బెదిరింపు లెటర్ రాశాడు. నా చావుకు కారణం డైరెక్టర్ శంకర్, గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు అలాగే ఎస్ వి సి ప్రొడక్షన్ టీమ్ వారే బాధ్యులంటూ చెప్పుకొచ్చాడు. గేమ్ చేంజర్ అప్ డేట్ కోసం ఏకంగా సూసైడ్ చేసుకుంటానంటూ రామ్ చరణ్ ఫ్యాన్ రాసిన లేక వైరల్ కావడంతో.. అభిమానం అంటే ఇలా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.
