Thalaivar 171 Title : రజనీ-లోకేశ్ మూవీ టైటిల్ రిలీజ్.. ఆ హీరో సినిమా పేరు కొట్టేశారుగా

- Advertisement -

Thalaivar 171 Title : లోకేశ్‌ కనగరాజ్‌.. కోలీవుడ్ లో ఇప్పుడు సూపర్ బిజీ డైరెక్టర్. ప్రముఖ స్టార్ హీరోలంతా ఇతడితో సినిమాలు చేసేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే లోకేశ్ మాత్రం పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నాడు. ఇటీవలే లియోతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ డైరెక్టర్.. తాజాగా తలైవా, సూపర్ స్టార్ రజనీ కాంత్ తో ఓ సినిమా చేస్తున్నాడు.

Thalaivar 171 Title
Thalaivar 171 Title

రజనీ 171వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి పలు రాకల టైటిళ్లు ప్రచారంలో ఉండేవి. రాణా, తంగమ్ అని పలు పేర్లు నెట్టింట వైరల్ అయినా.. ఇవి ఏవీ కాకుండా తాజాగా టైటిల్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ సినిమాకు ఎవరూ ఊహించనట్లు కూలీ అనే పేరును ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి టైటిల్ గ్లింప్స్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. అయితే ఈ పేరు ఇప్పటికే పలు సినిమాలకు ఉంది. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ కూలీ పేరుతో ఓ సినిమాలో నటించారు. ఇటీవలే వరుణ్ ధావన్ కూడా కూలీ పేరుతో ఓ చిత్రం చేశాడు. ఇక టాలీవుడ్ లో వెంకటేశ్ కూడా కూలీ నంబర్ 1 పేరుతో ఓ సినమాలో నటించాడు. అయితే ఈ పేరుతో ఉన్న ఈ సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాకు కూడా ఈ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

ఇక తలైవా కూలీ మూవీ ఈ గ్లింప్స్ మొత్తం యాక్షన్ సీక్వెన్స్ తో అదిరింది. సాధారణంగా లోకేశ్ సినిమా అనగానే యాక్షన్ కామన్. ఈ చిత్రంలో ఆ యాక్షన్ కు తోడు తలైవా స్టైల్ కూడా యాడ్ అయింది. ఇంకేం టైటిల్ టీజరే ప్రేక్షకుల్లో సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేసేసింది. ఎప్పటిలాగే ఈ గ్లింప్స్ లో రజనీ స్టైల్, యాటిట్యూడ్​ ఫైటింగ్​, డైలాగ్స్​ అదిరిపోయాయి. ఈ వీడియో చూస్తుంటే ఈ సినిమా బంగారం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్​లో తెరకెక్కుతున్నట్లు అనిపిస్తోంది.

- Advertisement -

 కోలీవుడ్​లో ఖైదీ, విక్రమ్​, లియో వంటి బ్లాక్ బస్టర్లతో స్టార్ డైరెక్టర్​గా గుర్తింపు తెచ్చుకున్నాడు లోకేశ్ కనగరాజ్. అయితే లియో విషయంలో మాత్రం కొంత నెగిటివ్ టాక్ వచ్చింది. అందుకే ఈసారి రజనీ మూవీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రజనీ కాంత్ ను మునుపెన్నడూ చూడని అవతారంలో చూస్తామని లోకేశ్ ఇంతకు ముందు చెప్పాడు. తన గత సినిమాల్లో లాగా ఈ చిత్రంలో డ్రగ్స్ వినియోగం వంటి సీన్లు ఉండవని ముందే చెప్పేశాడు.

మరోవైపు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో రజనీ కాంత్ తో పాటు మరో స్టార్ హీరో నటించనున్నాడట. ఆయనెవరో కాదు మన టాలీవుడ్ కింగ్ నాగార్జున. ఈ ఇద్దరితో కలిసి మల్టీస్టారర్ గా ఈ సినిమా తీయబోతున్నట్లు సమాచారం. ఇంకో సర్ ప్రైజ్ ఏంటంటే.. ఈ మూవీలో రజనీకాంత్‌  కూతురు పాత్ర కోసం శ్రుతిహాసన్​ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు విషయాలపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమా చూడటానికి మరో రెండు కారణాలు ప్రేక్షకులకు దొరికేసినట్టే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here