Vishal : ఏంటీ.. విశాల్ కు కారు కూడా లేదా? .. అంత దీనస్థితిలో ఉన్నాడా?

- Advertisement -

Vishal : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తెలుగు వాళ్లకు కూడా పరిచయమే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో విశాల్ చాలా బిజీగా ఉన్నాడు. అయితే కొంతకాలంగా తన గురించి వార్తల్లో తరచూ ఏదో న్యూస్ వస్తోంది. ఓసారి రాజకీయ అరంగేట్రం గురించి వస్తే.. మరోసారి నిర్మాతతో ఫైట్.. ఇంకోసారి పెళ్లి గురించి… ఇలా రకరకాల కారణాలతో ఈ మధ్య నిత్యం విశాల్ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా మరోసారి విశాల్ వార్తల్లోకి వచ్చాడు. అయితే ఈసారి తనపై వస్తున్న రూమర్స్ గురించి క్లారిటీ ఇచ్చాడు.

Vishal
Vishal

విశాల్ కోలీవుడ్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో రత్నం అనే సినిమా తీశాడు. ఈ సినిమా ఈ నెల 26వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో విశాల్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్ర బృందం ఓ కాలేజ్ లో రత్నం ప్రమోషన్స్ చేసింది. అయితే ఈ ఈవెంట్ లో విశాల్ తన గురించి కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ఈ సందర్భంగా విశాల్ చెప్పిన విషయం ఇప్పుడు ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసింది. అదేంటంటే…

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయడం కోసం విశాల్ పోలింగ్‌ కేంద్రానికి  సైకిల్‌పై వెళ్లాడు. ఈ విషయం కాస్త బాగా వైరల్ అయింది. అయితే గతంలో దళపతి విజయ్ కూడా ఇలాగే వెళ్లాడు.  విజయ్‌ను స్ఫూర్తిగా తీసుకునే ఆయన ఈవిధంగా చేశారని చాలామంది మాట్లాడుకున్నారు. ఈ విషయంపై తాజాగా జరిగిన ‘రత్నం’ ఈవెంట్‌లో విశాల్‌ స్పందిస్తూ.. అందరూ అనుకుంటున్నట్లు తాను విజయ్‌ను ఫాలో కాలేదన్నాడు.

- Advertisement -

‘‘విజయ్‌ అంటే నాకెంతో ఇష్టం. ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొని అతడు ఈ స్థాయికి వచ్చాడు. విమర్శలు వచ్చినప్పుడు మానసికంగా కుంగుబాటుకు గురవుతాం. ఆ బాధను తట్టుకుని స్టార్‌గా ఎదగడం సాధారణ విషయం కాదు.  అందుకే అతడంటే నాకెంతో ఇష్టం. వ్యక్తిగత కారణాల వల్ల ఆరోజు పోలింగ్‌ కేంద్రానికి సైకిల్‌పై వెళ్లా. విజయ్‌ను ఇమిటేట్‌ చేయడం కోసం అలా చేయలేదు. ప్రస్తుతం నా తల్లిదండ్రులకు మాత్రమే కారు ఉంది. నాకు లేదు. కొంతకాలం క్రితం అమ్మేశా. నగరంలో రోడ్లు దారుణంగా ఉన్నాయి. సైకిల్‌పై అయితే ఎటువంటి ఇబ్బందిలేకుండా ప్రశాంతంగా ప్రయాణించవచ్చు అనిపించింది’’ అని విశాల్ అసలు సంగతి చెప్పాడు.

అయితే ఈ విషయం చెచబుతూ విశాల్ తనకు కారు లేదని చెప్పడం ఇప్పుడు అభిమానులను కాస్త సర్ ప్రైజ్ చేసింది. స్టార్ హీరోకు సొంతంగా కారు కూడా లేకపోవడం ఏంటని నెట్టింట చర్చ జరుగుతోంది. అయితే విశాల్ గత కొంతకాలంగా అప్పుల్లో ఉన్నాడంటూ కొందరు అంటుంటే.. వరుసగా సినిమాలు చేస్తున్న హీరో అప్పుల్లో ఎలా ఉంటాడంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నాడు. మరి విశాల్ కారు అమ్మేశాక.. ఇంకో కారు కొనుగోలు చేయకపోవడానికి కారణమేంటో గానీ ఇప్పుడు ఈ విషయం నెట్టింట డిబేట్ గా మారింది.

ఇక ఇదే ఈవెంట్ లో విశాల్ తన పెళ్లి రూమర్స్ గురించి కూడా మాట్లాడాడు. ‘‘నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటా. ఇంట్లో వాళ్లందరూ నా పెళ్లి కోసమే ఎదురుచూస్తున్నారు. సౌత్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ కోసం భవనం నిర్మించిన వెంటనే పెళ్లి చేసుకుంటా. ప్రస్తుతం అది నిర్మాణదశలో ఉంది. ఆ భగవంతుడు నాకోసం ఒక అమ్మాయిని పుట్టించే ఉంటాడు. తప్పకుండా ఆమె నాకోసం ఎదురుచూస్తుంటుంది’’ అని అసలు సంగతి చెప్పుకొచ్చాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here