Tillu Cube మూవీకి డైరెక్టర్ కన్ఫార్మ్!.. సిద్ధు మాం..చి ఫామ్ లో ఉన్నాడుగా.. !!

- Advertisement -

Tillu Cube  : సిద్ధు జొన్నలగడ్డ… సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ.. ఆ తర్వాత హీరోగా మూవీస్ మొదలుపెట్టి.. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఏకంగా వంద కోట్ల స్టార్ అయిపోయాడు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాడు. ఈ సినిమాలు జనం మీద ఎంత ఇంపాక్ట్ చూపించాయంటే.. జనం సాధారణంగా మాట్లాడుకునేటప్పుడు ఈ చిత్రంలోని డైలాగ్స్ ఉపయోగించే అంత. ఈ సినిమాల్లోని ఒక్కో డైలాగ్.. ఒక్కో డైమండ్. అసలు ఇప్పటికీ మైండ్ లో నుంచి పోవట్లే అంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో ఇంపాక్ట్ చేశాయో. ఇక ఈ చిత్రాలు పంచిన కామెడీ అంతా ఇంతా కాదు.

Tillu Cube
Tillu Cube

డీజే టిల్లుతోనే సూపర్ కామెడీ పంచాడంటే.. టిల్లు స్క్వేర్ తో డబుల్ ఫన్ అందించాడు సిద్ధు. అందుకే ఆ సినిమా ఏకంగా 125 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది. సిద్దు జొన్నలగడ్డ- మల్లిక్ రామ్​ కాంబోలో తెరకెక్కిన ‘టిల్లు స్క్వేర్’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.  మార్చి 29న రిలీజై వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే డీజే టిల్లులో చివరకు సెకండ్ పార్ట్ ఉంటుందని హింట్ ఇచ్చిన దర్శకుడు.. టిల్లు స్క్వేర్ లో కూడా పార్ట్-3 ఉంటుందని చెప్పేశాడు. ఇక ఇప్పుడు సిద్ధు ఈ సినిమా పనిలో బిజీగా ఉన్నాడు. అయితే పార్ట్-3కి టిల్లు క్యూబ్ అని టైటిల్ పెట్టబోతున్నట్లు హింట్ కూడా ఇచ్చింది టీమ్.

అయితే 2022లో వచ్చిన టిల్లు తొలి భాగం DJ టిల్లు సినిమాను విమల్ కృష్ణ తెరకెక్కించాడు. మొదటి సినిమానే అయినా అరంగేట్ర చిత్రంతోనే సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాకు సిద్ధు రైటర్ గా కూడా పనిచేశాడు. ఇక రీసెంట్​గా థియేటర్లలో సందడి చేసిన టిల్లు స్క్వేర్ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు.  ఈ చిత్రం ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ఈ మూవీకి కూడా సిద్ధు కో రైటర్ గా పనిచేశాడు. అయితే ఇప్పుడు పార్ట్-3 డైరెక్టర్ గురించి నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది.

- Advertisement -

టిల్లు మూవీలాగే సూపర్ హిట్ అయిన మరో కామెడీ చిత్రం మ్యాడ్. ఇది కూడా టిల్లు స్క్వేర్ తీసిన సితారా ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లోనే రూపొందింది. అయితే ఇప్పుడు మ్యాడ్ కు కూడా సీక్వెల్ గా మ్యాడ్-2 తీస్తున్నారు. ‘మ్యాడ్’ (MAD) తెరకెక్కించిన కల్యాణ్ శంకర్ పార్ట్-2 కూడా అనౌన్స్ చేసి ఇటీవలే పూజ కూడా చేశారు. అయితే తాజాగా వైరల్ అవుతున్న వార్త ప్రకారం.. మ్యాడ్ -2 తర్వాత కల్యాణ్.. టిల్లు క్యూబ్ కూడా చేయనున్నాడట. ఆ సినిమా తర్వాత టిల్లు క్యూబ్ స్క్రిప్ట్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.  ఈ సీక్వెల్​కు కూడా సిద్ధు కో రైటర్​గా పనిచేసే ఛాన్స్ ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here