Rajinikanth : కొన్ని క్లాసిక్స్ ని అసలు ముట్టుకోకూడదు. ఒకవేళ వాటిని ముట్టుకున్నా ఎంతో జాగ్రత్తగా డీల్ చెయ్యాలి. కానీ ఈమద్య కొంతమంది దర్శకులు, నిర్మాతలు సీక్వెల్స్ పేరిట డబ్బులు క్యాష్ చేసుకోవచ్చని కథ , కంటెంట్ లేకుండా ఇష్టమొచ్చినట్టు సినిమాలను తీసి జనాల మీదకి వదులుతున్నారు. సీక్వెల్స్ అని చెప్పడం వల్ల ఓపెనింగ్స్ అయితే వస్తాయి కానీ, లాంగ్ రన్ లో మాత్రం డిజాస్టర్స్ గా మిళుతున్నాయి.
అలా సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన ‘చంద్రముఖి’ చిత్రానికి సీక్వెల్ గా ‘చంద్ర ముఖి 2 ‘ చిత్రాన్ని తీసి మొన్న తెలుగు , తమిళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేసారు. ఈ సినిమాకి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. అసలు ఇది నిజంగా సీక్వెల్ యేనా, పాత చంద్రముఖి ని క్యారెక్టర్స్ ని మార్చి తిప్పి తీసినట్టు ఉంది అంటూ కామెంట్స్ వినిపించాయి.
రజినీకాంత్ ని చంద్రముఖి 2 చెయ్యమని దర్శక నిర్మాతలు ఎప్పుడో కలిశారు, కానీ అది వర్కౌట్ అవ్వదని, వేరే ఎవరితోనైనా చేసుకోమని ఆ చిత్ర దర్శకుడు డైరెక్టర్ పీ వాసు కి చెప్పాడు. చాలా ఏళ్ళ తర్వాత ఆయన రాఘవ లారెన్స్ ని హీరో గా పెట్టి ఇప్పుడు చేసాడు. ఈ చిత్రం ప్రారంభానికి ముందే రజినీకాంత్ అడిగాడట, ఇది మొదటి భాగానికి కొనసాగింపు కాదు కదా అని. డైరెక్టర్ దానికి దీనికి సంబంధమే లేదు అని చెప్పాడట. కానీ రీసెంట్ గా ఈ సినిమాని చూసిన రజినీకాంత్ కి మైండ్ బ్లాక్ అయ్యిందట.
ఇదేంటి పాత సినిమాతో లింక్ లేదు అన్నాడు, కానీ ఇన్ని లింక్స్ పెట్టాడు, నా క్యారక్టర్ ని కూడా వాడుకున్నాడు అని చాలా ఫైర్ అయ్యాడట. తన అనుమతి లేకుండా ఆ పాత్ర ని ఈ సినిమాలో ఎందుకు వాడుకున్నావ్ అంటూ డైరెక్టర్ పై విరుచుకుపడ్డాడు అట, సరైన వివరణ ఇవ్వకపోతే మీ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాను అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడట. రజినీకాంత్ ని ఇంత కోపం గా చూడడం ఇదే తొలిసారి అంటూ తమిళ ఇండస్ట్రీ మొత్తం దీని గురించి మాట్లాడుకుంటున్నారు.