Allu Arjun : ఫ్యాన్స్ ని ఫూల్స్ చేసిన అల్లు అర్జున్..ఫేమ్ కోసం ఇంత దిగజారాలా!

- Advertisement -

Allu Arjun : కొంతమంది డైరెక్టర్స్ చేసే పనుల వల్ల హీరోలకు చెడ్డ పేరు వస్తుంది. అలా రీసెంట్ గా డైరెక్టర్ క్రిష్ చేసిన పనికి అల్లు అర్జున్ కి చెడ్డ పేరు వచ్చింది. గత రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక హిందీ పోస్టర్ విడుదల అయ్యింది. ఆ పోస్టర్ మీద రెండు విభిన్నమైన గెటప్స్ తో ‘కభీ అప్నే..కభీ సప్నే’ అనే టైటిల్ ఉంది. ఆ పోస్టర్ క్రింద ఏ ఫిలిం బై క్రిష్ జాగర్లమూడి అని ఉంటుంది.

Allu Arjun
Allu Arjun

దీనిని చూసి అభిమానులు వీళ్లిద్దరు కలిసి ఎప్పుడు సినిమా చేసారు?, అల్లు అర్జున్ ఇన్ని రోజులు ‘పుష్ప : ది రూల్ ‘ సెట్స్ లో ఉన్నాడు కదా, ఈ సినిమా ఎలా సాధ్యపడింది అని అభిమానులు తికమక పడ్డారు. అలా తికమక పడుతున్న సమయం లో కాసేపటి తర్వాత టీజర్ కూడా లీక్ అయ్యింది.

కొంతమంది బాలీవుడ్ ఆర్టిస్టుల పేరు వీడియో లో వేస్తూ చివర్లో అల్లు అర్జున్ పేరు వేస్తారు. కమింగ్ సూన్ అని టైటిల్స్ కూడా పడుతుంది. మొత్తం ఒక సినిమా ఉంది అన్నట్టుగానే బిల్డప్ ఇచ్చారు. తీరా చూస్తే అది ‘రెడ్ బస్’ యాప్ కి సంబంధించిన వీడియో. ఇది తెలుసుకొని అభిమానులు మొత్తం షాక్ అయ్యారు.

- Advertisement -

కేవలం యాప్ మీద హైప్ తీసుకొని రావడానికే ఈ ట్రిక్ ని వాడారని, అంతే కానీ ఇప్పట్లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడైతే ఇది యాడ్ అని తెలిసిందో అప్పటి నుండే సోషల్ మీడియా లో అల్లు అర్జున్ మీద తీవ్రమైన నెగటివిటీ ఏర్పడింది. ఒక చిన్న యాడ్ వీడియో కోసం ఇంత మందిని ఫూల్స్ చెయ్యాలా?, ఇదేమి చీప్ ట్రిక్స్ అంటూ అల్లు అర్జున్ దురాభిమానులు మండిపడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here