Bigg Boss నుండి తేజ ని బయటకి గెంటేయండి అంటూ నాగార్జున ని డిమాండ్ చేసిన కంటెస్టెంట్స్..!

- Advertisement -

Bigg Boss : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 ఎంత రసవత్తరం గా సాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. గత వారం అయితే బిగ్ బాస్ హౌస్ వాడివేడి వాతావరణం లో కొనసాగింది. నామినేషన్స్ దగ్గర నుండి, పవర్ అస్త్ర టాస్క్ వరకు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే ఉత్కంఠ ఉన్నింది. చివరికి పల్లవి ప్రశాంత్ ఈ టాస్కు ని గెలిచిన సంగతి అందరికి తెలిసిందే.

Bigg Boss
Bigg Boss

పాపం యావర్ ఈ వారం కూడా ఎంతో కస్టపడి ఓడిపోవాల్సి వచ్చింది. ఇదంతా పక్కన పెడితే పవర్ అస్త్ర టాస్కు లో భాగంగా ‘స్మైలీ’ టాస్కుని ఇచ్చాడు బిగ్ బాస్. ఒక బాక్స్ ఆకారం లో గీత గీసి, అందులో నిలబడి కానీ, కూర్చొని కానీ స్మైల్ ఇవ్వాలి. అప్పుడు శివాజీ వాటికి ఫోటోలు తీస్తాడు. ఈ టాస్కులో తేజా కాస్త హద్దులు దాటి ప్రవర్తించిన సంగతి అందరికీ తెలిసిందే.

గౌతమ్ ని వెనక్కి లాగే ప్రక్రియ లో తేజా బెల్ట్ తీసుకొని మెడ మీద కొడుతూ వెనక్కి లాగుతాడు. పాపం గౌతమ్ మెడ మొత్తం ఎర్రగా కమిలిపోయి ఉంటుంది. ఈ రోజు ఆ అంశం పై నాగార్జున తేజ ని కడిగిపారేసాడు. కేవలం తేజా ని మాత్రమే కాదు, శివాజీ కి కూడా బాగా కోటింగ్ పడింది. గౌతమ్ తేజ ని బెల్ట్ తో లాగుతున్నప్పుడు ఆపావు, అక్కడి వరకు అంతా బానే ఉంది. కానీ తేజా గౌతమ్ ని అలా బాదుతూ హింస పెడుతుంటే ఆపాలని తెలియలేదా నీకు అని ప్రశ్నిస్తాడు.

- Advertisement -

దానికి శివాజీ ఏమని సమాధానం చెప్పాలో తెలియక బిక్క మొహం వేసాడు. ఇక సంచాలక్ గా వ్యవహరించిన సందీప్ కి ఇంత జరుగుతుంటే వేడుకలాగా చూస్తూ కూర్చున్నందుకు నాగార్జున చేత చివాట్లు పడ్డాయి. ఇంతటి ఘోరం చేసిన తేజా ని ఏమి చేద్దాం అని నాగార్జున ఇంటి సభ్యులను అడగగా, సందీప్ వాడికి జైలు శిక్ష చాలా చిన్నది సార్, ఇంటి నుండి బయటకి పంపేయండి అంటాడు. ఆ తర్వాత ఏమి జరిగిందో ఈరోజు ఎపిసోడ్ లో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here