‘ఒకే ఒక్కడు’ సినిమా చెయ్యడానికి వణికిపోయిన రజినీకాంత్.. కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

- Advertisement -

సౌత్ ఇండియా లో ఏ హీరోకి అయినా రాజమౌళి మరియు శంకర్ లాంటి దిగ్గజ దర్శకులతో పని చెయ్యాలని కోరిక ఉంటుంది. ఎందుకంటే సూపర్ స్టార్స్ ని మించిన ఇమేజి ఈ ఇద్దరి దర్శకుల సొంతం. మన సౌత్ ఇండియన్ మార్కెట్ యొక్క ప్రతిభ ని వీళ్లిద్దరు కలలో కూడా ఊహించని రేంజ్ కి తీసుకెళ్లారు. రాజమౌళి ఈమధ్య పాపులర్ అయ్యుండొచ్చు కానీ, శంకర్ రెండు దశాబ్దాలకు ముందే మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేసాడు.

రజినీకాంత్
రజినీకాంత్

అప్పట్లోనే ఈయన ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’, ‘జీన్స్’ , ‘ప్రేమికుడు’ వంటి చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని కొల్లగొట్టాడు. అందుకే శంకర్ అంటే మన తెలుగు ఆడియన్స్ కి కూడా ఎంతో ఇష్టం. ఆయన తెరకెక్కించిన ప్రతీ సినిమా తెలుగు లో కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలాంటి హిట్ చిత్రాలలో ఒకటి ‘ఒకే ఒక్కడు’.

ఈ సినిమా అప్పట్లో సౌత్ లో సృష్టించిన సునామి మామూలుది కాదు. ఆరోజుల్లోనే ఈ చిత్రం 60 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. కేవలం తెలుగు వెర్షన్ వసూళ్లే 24 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చి ఉంటుందని అంచనా. అమెరికా లో పాపులర్ టీవీ రిపోర్టర్ నిక్సన్ మరియు అమెరికన్ ప్రెసిడెంట్ కి మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూ ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రం స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడు డైరెక్టర్ శంకర్. ఒక్క రోజు లో ముఖ్యమంత్రి అయ్యే వెసులుబాటు ఉందా అనే అంశం మీద హై కోర్టు జడ్జీ ని కలిసి, అనేక పాయింట్స్ రాసుకొని దానికి తగ్గట్టుగా స్క్రిప్ట్ ని తయారు చేయించాడు. అయితే ఈ చిత్రం లో హీరో గా శంకర్ సూపర్ స్టార్ రజినీకాంత్ ని ఫిక్స్ అయిపోయాడు.

- Advertisement -

ఆయనకీ వెళ్లి కథ వినిపించగా, ఇది మన తమిళనాడు ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా ఉన్నట్లుంది, ఈ సినిమా నేను చేస్తే చాలా ఇబ్బందులు ఎదురు అవుతాయి నేను చెయ్యను అని చెప్పాడట. ఆ తర్వాత కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్ మరియు విజయ్ వంటి హీరోలను కూడా సంప్రదించాడట శంకర్. కానీ ఎవ్వరూ ఒప్పుకోలేదు, చివరికి ఆయన అర్జున్ తో ఈ చిత్రాన్ని తీసి సౌత్ ఇండియా ని షేక్ చేసాడు. అయితే ఇదే చిత్రాన్ని శంకర్ హిందీ లో అనిల్ కపూర్ తో మిస్టర్ ఇండియా పేరుతో రీమేక్ చేసాడు. అక్కడ మాత్రం ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here