‘భోళా శంకర్’ మూవీ మొట్టమొదటి రివ్యూ.. చెల్లి సెంటిమెంట్ అంత అద్భుతంగా పండిందా..?

- Advertisement -

ఈ ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి నుండి విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. ‘ఆచార్య’ మరియు ‘గాడ్ ఫాదర్’ వంటి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో అభిమానులను నిరాశపర్చిన మెగాస్టార్, ఈ చిత్రం తో ఏకంగా 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించాడు.

భోళా శంకర్
భోళా శంకర్

అలాంటి సినిమా తర్వాత ఆయన చేసిన చిత్రం ‘భోళా శంకర్’ మరో వారం రోజుల్లో మన ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి UA సర్టిఫికేట్ ని జారీ చేసారు. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన అజిత్ ‘వేదలమ్’ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా ని తెరకెక్కించాడు డైరెక్టర్ మెహర్ రమేష్.

ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది సినీ ప్రముఖుల సమక్షం లో ప్రదర్శించారు . ఈ షో నుండి చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ మార్క్ కామెడీ , ఎమోషన్స్ , ఫైట్స్, డ్యాన్స్ ఇలా అన్నీ కూడా ఆయన అభిమానులకు ఫీస్ట్ ని కలుగచేసే విధంగా ఈ చిత్రం ఔట్పుట్ వచ్చిందని అంటున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశం ట్విస్ట్ తో అడిగిపోతుందట.

- Advertisement -

ఆన్ స్క్రీన్ మీద సాంగ్స్ కూడా అదిరిపోయాయట. ఇక ఈ చిత్రం లో ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ చిరంజీవి కి చెల్లెలు గా నటించిన సంగతి అందరికీ తెల్సిందే. వీళ్లిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలు అద్భుతంగా పండాయట. అలా ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాడని, మెగాస్టార్ ఖాతాలో మరో వంద కోట్ల రూపాయిల సినిమా రాబోతుందని అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here