‘నా భార్యకు అతడితో ఎఫైర్.. ఆమెతో కలిసి బతకలేను’.. బాలీవుడ్ నటిపై భర్త ఆరోపణలుబాలీవుడ్ లో బుల్లితెర నటిగా.. వ్లాగర్ గా చారు అసోపకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆకట్టుకునే గ్లామర్.. అలరించే నటనతో ఈ భామ హిందీ సీరియల్స్ లో దూసుకెళ్తోంది. బల్ వీర్ లో అత్ఖాతి పరిగా.. మేకే అంగ్ నే మేలో ప్రీతిగా.. జీజీ మాలో పియాలీగా నటించి ప్రతి ఇంట్లో ఫేవరెట్ అయిపోయింది. ఈ బ్యూటీ 2019లో సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ ను ఆమె రెండో వివాహం చేసుకుంది.

పెళ్లైన కొద్ది రోజుల నుంచి వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఇటీవల చారు అసోప ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది. తన భర్త రాజీవ్ రోజూ తనకు నరకం చూపించేవాడని.. తమ మధ్య గొడవ అయిన ప్రతీసారి తనను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయేవాడని వాపోయింది. రాజీవ్ తనను పెట్టిన టార్చర్ గురించి ఆమె సోదరి సుస్మితా కూడా తెలుసంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ విబేధాల కారణంగా తాము కొన్ని రోజులు విడిపోయామని.. పెద్దలు నచ్చజెప్పడంతో మళ్లీ కలిసిపోయామని అయినా తనలో మార్పు రాలేదని చెప్పింది. రాజీవ్ టార్చర్ వల్ల తాను ఎన్నో ఆఫర్లు కోల్పోవాల్సి వచ్చిందని చారు ఆరోపించింది. ఇకపై అతనితో కలిసి ఉండనని విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. 

తన భార్య చారు చేసిన ఆరోపణలపై రాజీవ్ కూడా మీడియా ముందుకొచ్చి సమాధానమిచ్చాడు. విమెన్ కార్డును అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడుతుందని మండిపడ్డాడు. నిజానికి చారునే ఆమె తోటి నటుడు కరణ్ మెహ్రాతో రొమాంటిక్ రీల్ చేసిందన్నాడు. కరణ్.. చారు మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందనేలా రాజీవ్ మాట్లాడాడు. ఫస్ట్ ఆమె తనపై మీడియా ముందుకొచ్చి ఆరోపణలు చేసిందని.. అందుకే తాను కూడా రావాల్సి వచ్చిందని రాజీవ్ చెప్పాడు. ఇకపై చారుతో కలిసి జీవితాన్ని పంచుకునే లేదని తేల్చి చెప్పాడు.