‘వేసుకునే బట్టల్ని బట్టి ఆఫర్లు ఇస్తారా.. ఇదేం పిచ్చి’.. స్టార్ నటి సెన్సేషనల్ కామెంట్స్సినిమా ఫీల్డ్ లో ముక్కు సూటిగా ఉండేవారు చాలా తక్కువ. కానీ ఆఫర్లు వచ్చినా రాకపోయినా.. సినిమాలు తీసినా తీయకపోయినా.. తమకు నచ్చందే ఏ పనీ చేయరు కొందరు. ఏదైనా ముక్కు సూటిగా ఉంటారు. అలాంటి కోవకు చెందిన నటి నీనా గుప్తా. గత ముప్పై ఏళ్లుగా బాలీవుడ్ లో సినీ, టెలివిజన్ రంగాల్లో రాణిస్తున్నారు నీనా. తాజాగా ఆమె నటించిన సినిమా ఊంచాయ్. ఈ మూవీ ఇవాళే థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సూరజ్ బర్జత్యా డైరక్షన్ లో అమితాబ్ తో కలిసి నీనా నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీనా సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాలు షేర్ చేసుకున్నారు.

కొందరు.. తాను వేసుకునే బట్టలను చూసి సినిమాల్లో ఆఫర్లు ఇచ్చేవారని నీనా గుప్తా చెప్పారు. ఒక మహిళ వేసుకునే దుస్తులను బట్టి ఆమె క్యారెక్టర్ డిసైజ్ చేయడం కరెక్ట్ కాదన్నారు. కెరీర్ తొలినాళ్లలో తాను వేసుకునే దుస్తులను చూసి దర్శక నిర్మాతలు తనకు బోల్డ్, వ్యాంప్ క్యారెక్టర్లే ఇచ్చే వారని చెప్పారు.

“తర్వాత నేను గృహిణి, తల్లి పాత్రల్లో నటించడంతో డైరెక్టర్లు నాకు ఏ పాత్ర ఇవ్వాలో కన్ఫ్యూజ్ అయ్యేవారు. ‘బాదాయి హో’ సినిమాలో మిడిల్ క్లాస్ గృహిణి పాత్రలో నటించాను. నేను చాలా హాట్ గా ఉంటానని.. ఈ పాత్రకి సరిపోనని ఆయుష్మాన్ నిర్మాతతో వాదించాడు. తర్వాత నేను చేసిన షార్ట్ ఫిల్మ్ కుజ్లీ చూపించిన తర్వాత కన్విన్స్ అయ్యాడు. వేసుకునే బట్టలను బట్టి.. వ్యక్తిత్వాన్ని బట్టి.. సినిమాల్లో ఆఫర్లు ఇవ్వొద్దు. ఆ పాత్రకు నేను సరిపోతానో లేదో నా బట్టలు చెప్పవు. నా టాలెంట్ చెబుతుంది. డాక్టర్ పాత్ర చేయాల్సిన వచ్చినప్పుడు వైట్ కోట్ వేసుకుంటాడని డాక్టర్ ను తీసుకోరు కదా?”  అని అన్నారు నీనా గుప్తా.