Chandramukhi2: 2005లో వచ్చిన సౌత్సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘చంద్రముఖి’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. నయనతార, జ్యోతిక, ప్రభు లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీ అప్పట్లోనే దాదాపు రూ.25కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను సీనియర్ దర్శకుడు పి.వాసు తెరకెక్కించారు. సుమారు 18ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. చంద్రముఖి 2గా సినిమా రూపొందుతుంది. ఈ చిత్రానికి కూడా పీ.వాసునే డైరెక్టర్. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, డైరెక్టర్ కమ్ హీరో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ వడివేలు, లక్ష్మీమీనన్, మహిమా నంబియార్, రాధికా శరత్‌కుమార్, రావు రమేష్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చందముఖి 2 పాన్ ఇండియా లెవల్లో వినాయక చతుర్ధి సందర్బంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం.

ఇటీవలే రిలీజైన పోస్టర్, సాంగ్స్ సినిమాపై అంచాలను భారీగా పెంచేశాయి. కొన్ని గంట క్రితం మూవీ మేకర్స్ చంద్రముఖి 2 ట్రైలర్ రిలీజ్ చేశారు. చంద్రముఖి సినిమా ఫస్ట్ పార్టు చివర్లో భవనం నుంచి బయటికి వెళ్లే పాముతోనే చంద్రముఖి-2 ట్రైలర్ ప్రారంభం అయింది. రాధికా శరత్ కుమార్ కుటుంబం ఓ భవనంలోకి వెళ్లడం కనిపిస్తోంది. దాంట్లో చంద్రముఖి ఆత్మ ఉందనే విషయాన్ని ట్రైలర్లో చూపించారు. రాజాధిరాజా.. రాజా గంభీర.. రాజా మార్తాండ.. వెట్టయ్య రాజా వస్తున్నాడు అంటూ ట్రైలర్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇక ఈ ట్రైలర్‌లో వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమ నంబియర్, రాధికా, రావు రమేష్‌లు కనిపించారు. లీడ్ రోల్ పోషిస్తున్న కంగనా రనౌత్ ట్రైలర్లో కనిపించేది కాసేపే అయినా ఆకట్టుకుంది. వెట్టయ్య రాజాగా హీరో రాఘవ లారెన్స్ దర్శనమిచ్చాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ కంప్లీట్ అయి.. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకునే పనిలో ఉంది.