Atlee : భర్తను మించిపోయిన స్టార్ డైరెక్టర్ భార్య.. వామ్మో అన్ని సినిమాలు చేసిందా!

- Advertisement -

Atlee : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి అట్లీకి సినిమా అంటే ఇష్టం. అతను విజువల్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో సినిమాపై ఆసక్తి పెరగింది. ఈ రంగంలో కెరీర్‌ను కొనసాగించేందుకు కుటుంబసభ్యుల మద్దతు కూడా లభించింది. కాలేజీలో స్నేహితులతో కలిసి ఎన్ మేల్ విజుంధ మజై తులి అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు.

Atlee
Atlee

ఆయన తీసిన ఈ షార్ట్ ఫిలిం తన కాలేజ్ లో పాపులర్ కావడమే కాకుండా తన షార్ట్ ఫిలింకి ఎన్నో అవార్డులు కూడా గెలుచుకుంది. మూడేళ్లు అలా పనిచేసిన అట్లీ తానే స్వయంగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. తమిళ రొమాంటిక్-కామెడీ చిత్రం ‘రాజా – రాణి’తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆర్య, జై, నయనతార ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చింది. 25 కోట్లతో తీసిన ఈ సినిమా రెండింతలు వసూళ్లు రాబట్టింది. అట్లీ సినిమా రాజా-రాణి చూసిన తర్వాత సూపర్ స్టార్ విజయ్ తలపతి అతనికి ఫోన్ చేశారు.

అట్లీ వర్క్ చూసిన విజయ్ దళపతి కూడా అతనితో కలిసి పని చేయాలనే కోరికను వ్యక్తం చేశాడు. మరుసటి రోజు అట్లీ తలపతి ఇంటికి చేరుకుని కొత్త సినిమా కోసం అతనికి ఒక కొత్త కథను వివరించాడు. విజయ్ తలపతికి కూడా ఈ సినిమా కథ నచ్చడంతో ఇద్దరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. వీరిద్దరూ కలిసి చేసిన ఈ సినిమా పేరు తేరి(తెలుగులో పోలీసోడు). 2016లో విడుదలైన థెరి సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. థెరి సినిమా తర్వాత అట్లీకి మరో కొత్త ఆలోచనతో విజయ్ తో మెర్సల్ తీశాడు. ఎస్ఎస్ రాజమౌళి తండ్రి అయిన వివి విజయేంద్ర ప్రసాద్‌ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. విజయ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో మరోసారి అట్లీ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. అట్లీ ప్రస్తుతం కింగ్ ఖాన్ షారూఖ్ తో జవాన్ సినిమాను తీశారు.

- Advertisement -

ఇది ఇలా ఉంటే.. రీసెంట్గా జవాన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో షారుక్ ఖాన్ అట్లీ భార్య గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అట్లీ భార్య పేరు ప్రియా అట్లీ. ఆమె సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఈమె అసలు పేరు కృష్ణప్రియ మోహన్. తాను మొదట సీరియల్స్ లో నటించింది. చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత సింగం సినిమాలో అనుష్క సోదరిగా అవకాశం వచ్చింది. ఆ సినిమాలో నటించి ప్రియా ప్రేక్షకులను మెప్పించింది. అలాగే ఆమె రాజా రాణి, నా పేరు శివ, తేరి(పోలీసోడు) సినిమాల్లో కూడా నటించింది. తమిళ సినిమాల్లోనే కాకుండా మలయాళ సినిమాల్లో కూడా ప్రియా అట్లీ నటించింది. ఇలా ఈమె తన భర్త అట్లీ కంటే.. చాలా సినిమాల్లో నటించి ఫేమస్ అయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here