Samantha : అమెరికానే తన సొంత ఇల్లుట.. బాంబు పేల్చిన సమంత..

- Advertisement -

Samantha విజయ్ నటించిన ఖుషి సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి రోజే ముప్పై కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. లైగర్ సినిమా కంటే ఎక్కువగానే ఓపెనింగ్స్ వయ్చాయని తెలుస్తోంది. భారీ హైప్‌తో వచ్చిన లైగర్‌ కంటే మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఖుషి మూవీ. అయితే రెండో రోజు లైగర్ అడ్రస్ లేకుండాపోయింది. కానీ ఖుషి డిమాండ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ఓవర్సీస్‌లో అయితే మరీ దారుణంగా ఖుషి కలెక్షన్లు వస్తున్నాయి. కేవలం రెండ్రోజుల్లోనే మిలియన్ డాలర్ క్లబ్బులోకి చేరిపోయాయి.

Samantha
Samantha

ఒక్కో హీరో, పెద్ద హీరోకి కూడా మిలియన్ డాలర్ క్లబ్బు చేరేందుకు వారం రోజులు పడుతోంది. భోళా శంకర్ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. కనీసం హాఫ్ మిలియన్ డాలర్లను కూడా కొల్లగొట్టలేకపోయినట్టు సమాచారం. దీనిపై సమంత ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆమె.. అక్కడి వారిని కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. తన కెరీర్‌ యూఎస్‌లోనే మొదలైందంటూ అక్కడి ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. ‘‘ఖుషి’ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈరోజు మీ అందరినీ కలవడం ఎంతో సంతోషంగా ఉంది. దీనిని నేను నమ్మలేకపోతున్నా. అమెరికాలోనే నా కెరీర్‌ ప్రారంభమైంది. నా కెరీర్‌ ఎదుగుదలలో భాగమైన ఇక్కడి వారిని కలవడానికి దాదాపు 13 ఏళ్లు పట్టింది.

ఇప్పటివరకూ నేను నటించిన 16 చిత్రాలు 1 మిలియన్‌ డాలర్లు అందుకున్నాయి. ‘ఖుషి’తో ఆ సంఖ్య 17కు చేరింది. అందుకు ఎంతో గర్విస్తున్నా. మీరు నాపై చూపిస్తోన్న అమితమైన ప్రేమకు ధన్యవాదాలు. గత నెల నుంచి యూఎస్‌లోనే పర్యటిస్తున్నా. మా సినిమాపై మీరు చూపిస్తోన్న ప్రేమ గురించి విజయ్‌తో చెబుతా. నాకు తెలుసు మీకు ఆయన అంటే ఎంతో ఇష్టమని. ఇంటికి దూరంగా కొన్ని వేల మైళ్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చినప్పటికీ.. ఇక్కడ ఉంటే నా ఇంట్లోనే ఉన్న భావన కలుగుతుంది’’ అని ఆమె చెప్పారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here