Radhika Apte : అమ్మాయిలు ప్రెగ్నెన్సీ రాకుండా ఏం చేయాలో, ఏ కండోమ్ వాడాలో చెప్పిన స్టార్ హీరోయిన్

- Advertisement -

Radhika Apte : రాధికా ఆప్టే.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు..బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. రాధికా ఆప్టే సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు, టీవీ షోల్లో కూడా కనిపిస్తూ క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపేస్తూ ఉంటుంది. ఇష్టమైన సినిమాలొస్తే అతిథిపాత్రలకైన అమ్మడు ఓకే చెప్పేస్తోంది. అ

 

- Advertisement -

బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా రాధికా ఆప్టే పేరు తెచ్చుకుంది. పాత్ర డిమాండ్ చేస్తే నగ్నంగా కూడా నటించేందుకు అమ్మడు సై అంటుంది. పలు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ సమస్యలు ఎదుర్కొంటుంది. పలు కామెంట్స్‌తో ట్రోల్స్ విమర్శలు ఎదుర్కొన్న తనకు అనిపించింది చేస్తూ, ముఖం మీదే ఉన్నది ఉన్నట్లు చెబుతుంది. రాధిక తెలుగులో బాలయ్య సరసన ‘లెజెండ్’ అనే సినిమాలో నటించి ఆకట్టుకుంది. కానీ తెలుగులో పెద్దగా ఆఫర్లు రాక బాలీవుడ్‌ లోనే సెట్ అయింది. ఓ వైపు సినిమాలు, మరో వైపు పలు యాడ్స్ చేస్తూ చేతినిండా సంపాదిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, రాధికా ఆప్టే అమ్మాయిలు ఎలాంటి కండోమ్ కొనుక్కోవాలో చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఈ వీడియో ఓ యాడ్‌కు సంబంధించినదని తెలుస్తోంది. ఇందులో ఈ బ్యూటీ మాట్లాడుతూ.. కండోమ్స్ సమాజంలో ఈ పేరు పలకడం నిషేధం.. ఎందుకు? కండోమ్స్ ఎప్పుడు మన పార్టనర్స్ ఛాయిస్ కే వదిలేస్తాం.. ఎందుకు ? ఈ నిర్ణయంలో మన మాటకు పట్టింపు ఉండదంటారా ? మన సుఖం వదిలి.. బాధను భరిస్తున్నాం.. మళ్లీ కండోమ్స్‌ను కూడా ఎందుకు భరించాలి. కండోమ్స్ విషయంలో మన సొంత నిర్ణయం ఎందుకు ఉండకూడదు. ఏ కండోమ్స్ మనకు ఆనందాన్ని, కంఫర్ట్‌ను ఇస్తుందో అదే ఎపిక్ కండోమ్స్‌ను వాడండి. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించకండి అమ్మాయిలు మీ కండోమ్ మీరే కొనుక్కోండి’’ అంటూ చెప్పుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here