Kalyani Priyadarshan : కుక్క కోసం అర్థరాత్రులు గుక్కపట్టి ఏడుస్తున్న స్టార్ హీరోయిన్

- Advertisement -

Kalyani Priyadarshan : ప్రముఖ దర్శకుడు ప్రియదర్శిన్, నటి లిజీల కూతురు కళ్యాణి ప్రియదర్శిన్. ఈమె తెలుగులో చేసినవి మూడే సినిమాలు అయినా.. అందరి హృదయాల్లో నిలిచిపోయింది. పేరుకు మలయాళ కుట్టి అయినప్పటికీ.. సినీ కెరీర్ స్టార్ చేసింది మాత్రం టాలీవుడ్ తోనే. తెలుగులో హలో, రణరంగం, చిత్రలహరి వంటి చిత్రాలు చేసింది. ఆ తర్వాత నుండి తెలుగు పరిశ్రమ వైపు చూడడం లేదు. మలయాళ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపోయింది.


తాజాగా మాలీవుడ్ ప్రముఖ హీరో జోజూ జార్జ్ హీరోగా తెరకెక్కిన మూవీ ఆంటోనీలో నటించింది. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ కళ్యాణి యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ కు కిక్కిస్తుంది. అయితే ఈ అమ్మడు చేసిన ఓ పోస్టు వైరల్ అవుతోంది. అందులో ఆమె అర్థరాత్రులు ఏడుస్తున్నట్లు తెలిపింది. ఇంతకు ఏం జరిగిందంటే..

- Advertisement -

ఈ బ్యూటీ అర్థరాత్రి ఓ విషయం గుర్తు చేసుకుని గుక్క పెట్టి ఏడ్చినట్లు తెలుపుతూ ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో కుక్క పాదాలను చేతిపై టాటూగా వేయించుకున్నట్లు ఉంది. ఇది ఎందుకు ఆరోగ్యకరమైనది కాదు.. అర్ధరాత్రి 11.30 నిమిషాలకు ఈ విషయం గుర్తుకు వచ్చి ఏడుస్తున్నా’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా హార్ట్ సింబల్, ఏడ్చే బొమ్మలను పెట్టింది. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కుక్క కోసం అర్థరాత్రులు కూర్చుని ఏడవాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here