Rakul : కూతురిపై అనుచిత వ్యాఖ్యలు.. ఆవేశంతో ఊగిపోయిన రకుల్ తండ్రి

- Advertisement -

Rakul : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అభిమానులు తమ ఫేవరేట్ నటీనటులకు సంబంధించిన వార్తలను ఏ లెవల్లో ట్రెండ్ చేస్తూ ఉంటారో మనకు తెలిసిందే. సోషల్ మీడియాలో కేవలం పాజిటివిటీనే కాదు నెగిటివిటీ వార్తలు కూడా ట్రెండ్ అవుతుంటాయి. కొన్నిసార్లు అది వాళ్ల కుటుంబసభ్యులను హర్ట్ చేసే విధంగా కూడా ఉంటాయి . ఇటీవల సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ గా మారింది . హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి ఒక టాప్ సెలబ్రిటీ ఒకరు హైదరాబాదులో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓ లగ్జీరియస్ ఇళ్లు కొనిచ్చాడన్న వార్త బాగా వైరల్ అవుతోంది.

rakul preet singh orange dress pics

సందీప్ కిషన్ హీరోగా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. కొన్నేళ్ల పాటు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా హల్ చల్ చేసింది. తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా సినిమాలు చేసింది. రకుల్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది . రకుల్ పని తాను చూసుకుంటూ వెళ్లిపోయే రకం. ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిన తర్వాత రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. అందులో ఒకటే లగ్జరీ హౌస్.

- Advertisement -

అయితే రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి ఆ రూమర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నా కూతురు కష్టంతో డబ్బు సంపాదించి ఇల్లు కొనుక్కుంటే వాడెవడో ఇచ్చాడంటారు. మీకు మతి పోయిందా..?” అంటూ ఓ రేంజ్ లో మండిపడ్డాడు. ఇది రూమర్ అయినప్పటికీ రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి మాత్రం ఆ విషయాన్ని తట్టుకోలేకపోయాడు. గతంలో ఎన్నో రూమర్స్ విన్నా కూడా ఈ రూమర్ ఆయనను బాగా బాధించింది అంట. తన కూతురుపై ఎందుకు చిత్ర విచిత్ర రూమర్స్ క్రియేట్ చేస్తారంటూ కోపగించుకున్నాడు. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here