Pushpa 2 Teaser Review : అమ్మోరు గెటప్​లో పుష్పరాజ్ విశ్వరూపం.. గంగమ్మ జాతరలో పూనకాలే

- Advertisement -

Pushpa 2 Teaser Review : వచ్చేశాడు.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్పరాజ్ మళ్లీ వచ్చేశాడు. ఈసారి అమ్మోరు వేషంలో గత్తెరలేపాడు. సినీ ప్రియులు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప- ది రూల్ సినిమా టీజర్ వచ్చేసింది. ఇవాళ ఏప్రిల్ 8వ తేదీ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ పుష్ప ఫ్యాన్స్​కు సూపర్ సర్​ప్రైజ్ ఇచ్చారు. ముందుగా చెప్పినట్టే.. బన్నీ బర్త్ డే రోజున మేకర్స్ పుష్ప-2 టీజర్ విడుదల చేశారు. గతంలో విడుదల చేసిన గ్లింప్స్ ఎంత పవర్​ ఫుల్​గా అయితే సాగిందో ఇప్పుడీ టీజర్ అంతకుమించి పవర్ ప్యాక్డ్​గా కనిపించింది.

Pushpa 2 teaser review
Pushpa 2 teaser review

నిమిషం ఎనిమిది సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్​లో అల్లు అర్జున్​ కాళీ అమ్మవారి వేషంలో యాక్షన్ అదరగొట్టేశాడు. అమ్మవారి వేషంలో పుష్ప మేనరిజంతో బన్నీ యాక్షన్ అదిరిపోయింది. ఇక గంగమ్మ జాతరలో తన పుష్ప మేనరిజాన్ని చూపిస్తూ విలన్లపై విరుచుపడిన తీరుకు థియేటర్​లో అయితే బాక్సులు బద్ధలవ్వడం ఖాయం. ఇక ఈ సీక్వెన్స్​లో బ్యాక్​గ్రౌండ్ స్కోర్​ను దేవీశ్రీప్రసాద్ రప్ఫాడించాడు. టీజర్​ చివర్లో గుండాల మీదకి అల్లు అర్జున్​ వెళ్లే సీన్ అయితే హైలైట్​గా నిలిచింది.

- Advertisement -

ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప ది రైజ్‌’. 2021లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరూ చూసిందే. ఎర్రచందనం కూలీ నుంచి స్మగ్లింగ్‌ సిండికేట్‌కు నాయకుడిగా పుష్ప ఎలా ఎదిగాడని ఫస్ట్ పార్ట్​లో చూపించారు. సిండికేట్‌కు లీడర్‌ అయ్యాక పుష్పకు ఎదురైన సవాళ్లు ఏంటి? మంగళం శ్రీను, భన్వర్‌ సింగ్‌ షెకావత్‌, దాక్షాయణి నుంచి ఎలాంటి ప్రమాదం పొంచి ఉందనే అంశాలతో ‘పుష్ప ది రూల్‌’ సిద్ధం కానున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై ఇది నిర్మితమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇందులో కూడా శ్రీవల్లి పాత్రలో రష్మిక నటిస్తోంది. ఇటీవలే ఆమె పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ శ్రీవల్లి లుక్​ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో పుష్ప రూల్ షురూ కాబోతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here