Pushpa 2 : అల్లుకి జోడీగా త్రిషా కాదా సమంత..నా.. గిదేంది అట్లీ గిట్ల చేసినావ్‌..

- Advertisement -

Pushpa 2 : పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవల్లో స్టార్ ఇమేజ్ సంపాదించాడు. దాంతో బన్నీ తదుపరి సినిమాలపై అన్ని భాషల ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది. పుష్ప 2 కోసం సౌత్ ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తాజాగా అల్లు అర్జున్, అట్లీ కాంబో మూవీ కన్ఫర్మ్ అయింది. ఏ క్షణంలోనైనా పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. జవాన్‌తో బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగాడు అట్లీ. అందుకే ఆయన సినిమా అన్నా కూడా హిందీ ప్రేక్షకులు చెవులు రిక్కించే రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోకు పాన్ ఇండియా రేంజ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే వారి సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు విడుదల అవుతుంది అనే వార్తల నుండి ఈ కాంబో హీరోయిన్ గురించి షాకింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమా కోసం మొదట త్రిషను అనుకున్నారు అట్లీ. అల్లు అర్జున్‌కి జోడీగా త్రిష ఏంటి అని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. అట్లీ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

త్రిష స్థానంలో స్టార్ హీరోయిన్ సమంతను ఎంపిక చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఏడాది పాటు విరామం తీసుకున్న సమంత మళ్లీ షూటింగ్‌లకు వెళ్లేందుకు సిద్ధమైంది. ముందుగా ఓ హిందీ సినిమా చేయాలని భావిస్తున్న సమంత త్వరలో అల్లు అర్జున్ సరసన అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించే అవకాశం ఉంది. పుష్పలో ఊ అంటావా అనే పాటలో బన్నీ, సామ్ స్క్రీన్ ప్రెజెన్స్ అంతా ఆకట్టుకున్నారు. అంతే కాకుండా సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. కాబట్టి కచ్చితంగా వీరి కాంబో మూవీకి మంచి బజ్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే అట్లీ ఆమెను కన్ఫర్మ్ చేయాలని అభిమానులు కోరుతున్నారు. మరొ కొందరయితే త్రీషా అయితేనే అల్లుకు జోడీగా బాగుంటుందని అల్లుకి జోడీగా సమంతనా? అని ప్రశ్నింస్తున్నారు. అట్లీ ఆలోచించాలని మళ్లీ సందిద్దంలో పడేశారు ప్రేక్షకులు. మరి అట్లీ ఎవరిని తీసుకుంటాడు? సమంతానే కంటిన్యూ చేస్తాడా? లేదా ప్లేస్‌ మారుస్తాడా అనే ఆలోచనలో వున్నారు అల్లు అభిమానులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here