Priyamani : రంజాన్ స్పెషల్ అట్టైర్​లో ప్రియమణి.. క్యూట్ పోజులతో దోచింది మది

- Advertisement -

Priyamani : టాలీవుడ్ నటి ప్రియమణి.. ఒకప్పుడు ఈ భామ ఓ సెన్సేషన్. వరుస హిట్లు ఇస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్​గా ఎదిగింది. ఆ తర్వాత సడెన్​గా ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గిపోయాయి. కొన్నిరోజులకు కనుమరుగైపోయింది. మళ్లీ కమ్​బ్యాక్ ఇచ్చి వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. గ్లామర్​తో కాకుండా గ్రామర్​తో ఈ బ్యూటీ సినిమాలు చేస్తోంది. వరుస పెట్టి ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్​లలో నటిస్తోంది. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్.. ఇంకోవైపు కోలీవుడ్, మాలీవుడ్​లలో తన సత్తా చాటుతోంది. ఇక డిజిటల్ మీడియాలో ప్రియమణి రూటే సపరేటు.

Priyamani
Priyamani

సెకండ్ ఇన్నింగ్స్​లో జోరు చూపిస్తున్న ప్రియమణి సోషల్ మీడియాలోనూ తన హవా సాగిస్తోంది. వరుస ఫొటోషూట్లు చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తుంది. ఇవాళ రంజాన్ సందర్భంగా ఆ పండుగకు సెట్ అయ్యే ఔట్​ఫిట్​లో కనిపించింది. గ్రీన్ కలర్ సల్వార్ కమీజ్​లో అచ్చం ముస్లిం అమ్మాయిలా అదరగొట్టింది. ఇక తన క్యూట్ క్యూట్ పోజులతో కుర్రాళ్ల మనసు దోచేసింది. కాటుక కళ్లతో మెస్మరైజింగ్ స్మైల్​తో బ్లాస్టింగ్ పోజులు ఇచ్చింది. ఇక ఈ భామ ఫొటోలు చూసి నెటిజన్లు తెగ ఫిదా అవుతున్నారు. వావ్ ప్రియా.. వాట్ ఏ బ్యూటీ అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు.

ఇక ప్రియమణి సినిమాల సంగతికి వస్తే ఈ బ్యూటీ నటించిన మైదాన్ మూవీ ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ప్రధాన పాత్ర పోషించారు. ఇక ఇటీవలే ఈ బ్యూటీ నటించిన ఆర్టికల్ 370 కూడా సూపర్ హిట్ అయింది. ఇక తెలుగులో భామాకలాపం-2తో ప్రేక్షకులను అలరించింది. ఇవే కాకుండా ప్రియమణి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ అన్ని భాషల్లోనూ అవకాశాలు అందుకుంటూ తన సత్తా చాటుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Priya Mani Raj (@pillumani)

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here