Priyamani : అందుకే నేను తెలుగులో టాప్ హీరోలతో నటించలేదు.. ఇప్పుడు సంతోషంగా ఉన్నా..: ప్రియమణి

- Advertisement -

Priyamani తెలుగుతోపాటు తమిళంలోనూ మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఈ మధ్య బాలీవుడ్ సినిమాలతో ఆమె బిజీ అయింది. అక్కడ మాత్రం షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ లాంటి టాప్ హీరోలతో సినిమాలు చేసింది. తాజాగా మైదాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే తెలుగు,తమిళం భాషల్లో మాత్రం అగ్ర హీరోలతో తాను ఎందుకు నటించలేదో వివరించింది. టాప్ తెలుగు, తమిళ హీరోలతో ఎందుకు పని చేయలేదు అని ప్రశ్నించగా.. ఇది తనకూ అంతు చిక్కడం లేదని ఆమె చెప్పింది.

Priyamani
Priyamani

“టాప్ హీరోలతో నేను ఎందుకు నటించలేదన్నది నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఈ ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లభించలేదు. ఈ విషయం డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లనే అడగాలి” అని ప్రియమణి చెప్పింది. “ఈ విషయంలో నిజాయతీగా చెప్పాలంటే నేను ఏ వ్యక్తినీ నిందించడం లేదు. కానీ చాలా మంది మాత్రం అగ్ర హీరోలతో నటించొద్దని, వాళ్ల సినిమాల్లోనూ ఉండొద్దని అనడం మాత్రం నాకు తెలుసు. తన వల్ల వాళ్లకే ఇబ్బంది అన్న కారణం కావచ్చు. ఇదే విషయం నేను చాలా రోజులుగా వింటున్నాను. ఇది నిజం కాదని నాకు తెలుసు. కానీ ఇప్పటికీ కచ్చితమైన కారణం ఏంటన్నది మాత్రం తెలియదు.

- Advertisement -

కారణం ఏదైనా సరే దీనిపై నేను పెద్దగా ఆలోచించడం లేదు. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో బాగానే ఉన్నాను” అని ప్రియమణి చెప్పింది. ప్రియమణి ఒకప్పుడు తెలుగు, తమిళంలలో వరుస అవకాశాలు అందుకున్న నటి. అయితే ఈ మధ్య కాలంలో ఆమె బాలీవుడ్ పై దృష్టిసారించింది. తొలిసారి చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీలో షారుక్ ఖాన్ తో కలిసి ఓ స్పెషల్ పాటలో నటించింది. ఆ తర్వాత జవాన్ లోనూ కనిపించింది. ఈ మధ్యే ఆర్టికల్ 370 మూవీలోనూ ప్రియమణి నటించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here