Guntur Kaaram : మహేష్ బాబు ‘గుంటూరు కారం’ లో కాల్చిన ఈ ఆయుర్వేదిక్ బీడీ ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

- Advertisement -

Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకప్పుడు చైన్ స్మోకర్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. అంటే రోజుకి 20 నుండి 30 సిగరెట్లకు తక్కువ కాకుండా తాగడం అన్నమాట. ఈ వ్యసనానికి బానిస అయినా మహేష్, ఒక పుస్తకం చదవడం వల్ల సిగరెట్ తాగే అలవాటు ని పూర్తిగా పక్కన పెట్టేసాను అంటూ అనేక ఇంటర్వ్యూస్ లో ఆయన ఈ విషయం పై ప్రస్తావించడం మనం చూసే ఉంటాం.

Guntur Kaaram
Guntur Kaaram

2010 వ సంవత్సరం నుండి ‘గుంటూరు కారం’ చిత్రానికి ముందు వరకు ఆయన ఒక్క సినిమాలో కూడా సిగరెట్ తాగలేదు. నా అభిమానులు కూడా నా నుండి ఎదో ఒక విషయం నేర్చుకోవాలి, వాళ్ళని చెడు మార్గం లోకి వెళ్లే ఏ పని కూడా నేను చెయ్యను అంటూ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. అలా చెప్పిన మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం లో అన్ని బీడీలు ఎలా కాల్చాడు అని అందరూ అనుకున్నారు.

Mahesh Babu

ఇదే విషయాన్నీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ సుమ మహేష్ బాబు ని అడుగుతుంది. ఆమె మాట్లాడుతూ ‘ఇంత క్లాస్ గా ఉండే మీరు అన్ని బీడీలు సినిమాలో ఎలా కాల్చారు అండీ’ అని సుమ అడగగా, దానికి మహేష్ బాబు సమాధానం చెప్తూ ‘అది నిజమైన బీడులు కాదు. ఆయుర్వేదిక్ బీడీలు..ముందుగా త్రివిక్రమ్ గారు నాకు ఒక మామూలు బీడీ ఇచ్చాడు. అది తాగిన తర్వాత మైగ్రేన్ వచ్చి నా తల పగిలిపోయింది.

- Advertisement -
Mahesh Babu Cigarette

అప్పుడు త్రివిక్రమ్ గారి దగ్గరకి వెళ్లి నా వల్ల కావట్లేదు సార్, ఎం చేద్దాం అంటారు ఇప్పుడు అని అడగగా, ఆయన నాకోసం ఆయుర్వేదిక్ బీడీ ఒకటి తెప్పించాడు. ఇది ఒకటి తాగిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. అలా కమిట్ అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. ఈ ఆయుర్వేదిక్ బీడీలు ఎక్కడ దొరుకుతాయి అని మహేష్ బాబు ఫ్యాన్స్ గూగుల్ లో వెతకడం మొదలు పెట్టారు. ఈ బీడీలు అమెజాన్ లో అందుబాటులో ఉంది. ఒక బీడీ కట్ట ధర 500 రూపాయిలు అట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here