Shivaji : బిగ్ బాస్ షో నుండి బయటకి వచ్చిన కొద్దీ రోజులకే కంటి చూపుని కోల్పోయిన శివాజీ!

- Advertisement -

Shivaji : బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ప్రముఖ హీరో శివాజీ సంపాదించిన క్రేజ్ అంతా ఇంత కాదు. అంతకు ముందు వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన శివాజీ మధ్యలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి సినిమాలకు పూర్తిగా దూరం అయ్యాడు. 2019 తర్వాత రాజకీయాల్లో కూడా కనుమరుగైన శివాజీ ని మన తెలుగు ఆడియన్స్ పూర్తిగా మర్చిపోయారు.

Shivaji
Shivaji

అలాంటి సమయం లో మళ్ళీ సినిమాల్లోకి రావాలనే కోరిక తో ఉన్న శివాజీ కి ‘బిగ్ బాస్’ రియాలిటీ షో లో అవకాశం రావడం నిజంగా ఆ దేవుడు ఇచ్చిన వరమే అని చెప్పుకోవచ్చు. సినిమాల ద్వారా ఆయన ఎంత క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించాడో తెలియదు కానీ, బిగ్ బాస్ షో ద్వారా మాత్రం సినిమాల్లో సంపాదించిన క్రేజ్ కంటే పది రెట్లు ఎక్కువ సంపాదించాడనే చెప్పాలి. బిగ్ బాస్ హిస్టరీ లోనే ఇలాంటి మైండ్ గేమర్ లేడు, శివాజీ ఒక చరిత్ర అనే రేంజ్ పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.

Bigg Boss Shivaji

ఇకపోతే రీసెంట్ గా విడుదలైన ‘నా సామి రంగ’ చిత్రం మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ ని దున్నేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు మూవీ టీం తో శివాజీ ఒక ఇంటర్వ్యూ చేస్తాడు. ఈ ఇంటర్వ్యూ లో శివాజీ సినిమా గురించి అనేక ప్రశ్నలు అడుగుతాడు. అలాగే నాగార్జున తో తనకి బిగ్ బాస్ వల్ల జరిగిన లాభనష్టాల గురించి కూడా ప్రస్తావనకు తీసుకొస్తాడు.

- Advertisement -
Shivaji

ఆయన మాట్లాడుతూ ‘ బిగ్ బాస్ హౌస్ లో ప్రయాణించడం నా పూర్వ జన్మ సత్ఫలితానికి నిదర్శనం గా నేను భావిస్తున్నాను. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఫోన్ దూరం గా ఉంది. అది దూరం అవ్వడం వల్ల నాకు ఎంతో మేలు జరిగింది. కంటి చూపు అద్భుతంగా పని చేసింది. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చానో, అప్పటి నుండి కంటి చూపు మందగించింది. ఎందుకంటే ఫోన్ వాడుతున్నాను కాబట్టి. ఇప్పుడు అద్దాలు పెట్టుకుంటే కానీ నాకు కళ్ళు కనపడవు’ అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here