Mahesh Babu : షారుఖ్ ఖాన్ నిర్మాణం లో ఆగిపోయిన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అదేనా?

- Advertisement -

Mahesh Babu : టాలీవుడ్ లో క్రేజీ మల్టీస్టార్రర్స్ ఒకప్పుడు చాలా అరుదుగా ఉండేది కానీ, ఇప్పుడు మాత్రం అది చాలా కామన్ అయిపోయింది. ఈ ట్రెండ్ మొదలైంది ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం నుండి. అప్పటి నుండి మెల్లగా మొదలైన ఈ ట్రెండ్ #RRR చిత్రం తో తారాస్థాయికి చేరుకుంది. ఇప్పుడు సమకాలీన హీరోలు కూడా కలిసి సినిమా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు.

Mahesh Babu
Mahesh Babu

ఇదంతా పక్కన పెడితే అప్పట్లో మహేష్ బాబు మరియు షారుఖ్ ఖాన్ కలిసి ఒక భారీ మల్టీస్టార్రర్ చిత్రం చెయ్యాలని అనుకున్నారట. ‘బ్రహ్మోత్సవం’ సినిమా సమయం లో మహేష్ తో ఈ విషయం గురించి చర్చించడానికి ఆయన ఇంటికి కూడా వెళ్ళాడు షారుఖ్ ఖాన్. మహేష్ కూడా షారుఖ్ తో కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాని షారుఖ్ ఖాన్ స్వయంగా తన ప్రొడక్షన్ హౌస్ లో నిర్మించాలని అనుకున్నాడు.

Mahesh Babu Shah Rukh Khan

తనతో ఎన్నో సూపర్ హిట్స్ మరియు ఆల్ టైం క్లాసిక్స్ ని అందించిన కరణ్ జోహార్ ఈ సినిమాకి దర్శకుడు అయితే బాగుంటుంది అని అనుకున్నాడు షారుఖ్ ఖాన్. ఆయన కెరీర్ లో ‘కభీ ఖుషి కభీ గామ్’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ఈ మల్టీస్టార్రర్ కోసం సిద్ధం చేసారు. కానీ ఇద్దరి హీరోలకు సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ నచ్చలేదు.

- Advertisement -

ఆ తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసి తీసుకొచ్చినా కూడా ఇద్దరు వంద శాతం సంతృప్తి చెందలేక ఉన్నారు. దీంతో కొన్ని రోజులు ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెడుదాం అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఎవరి ప్రాజెక్ట్స్ తో వారు బిజీ అవ్వడం వల్ల ఈ ప్రాజెక్ట్ అట్టకెక్కింది. ఒకవేళ ఈ సినిమా చేసి ఉంటే అప్పట్లోనే ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేది. భవిష్యత్తులో అయినా ఈ క్రేజీ మల్టీస్టార్రర్ సెట్స్ పైకి వెళ్తుందో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here