Colors Swathi : సాయి ధరమ్ తేజ్ కి స్టేజి మీద ముద్దు పెట్టిన కలర్స్ స్వాతి..వీళ్ళ మధ్య ఇంత రిలేషన్ ఉందా !

- Advertisement -

Colors Swathi : ‘కలర్స్’ అనే టీవీ షో ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించుకొని తన స్క్రీన్ నేమ్ గా మార్చుకున్న స్వాతి , ఆ తర్వాత సినిమాల్లోకి హీరోయిన్ గా వచ్చి మంచి సక్సెస్ సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈమె నటించిన సినిమాలు ఎక్కువ శాతం సూపర్ హిట్ సాధించినవే ఉన్నాయి. ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమా ద్వారా వెండితెర కి పరిచయమైనా స్వాతి, ఆ తర్వాత ‘అష్టా చమ్మ’ సినిమా ద్వారా హీరోయిన్ గా మారింది.

ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఈమెకి వరుసగా ఆఫర్స్ వచ్చాయి. ఈమె తెలుగు మరియు తమిళం భాషల్లో వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా మారింది. అలా కెరీర్ పీక్ రేంజ్ లోకి వెళ్తున్న సమయం లో వికాస్ వాసు అనే మలయాళీ పైలట్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైనా కలర్స్ స్వాతి, మళ్ళీ ఇన్నాళ్లకు రీ ఎంట్రీ ఇచ్చింది.

Colors Swathi
Colors Swathi

ఇప్పుడు ఆమె లేటెస్ట్ గా ‘మంత్ ఆఫ్ మధు’ అనే చిత్రం చేసింది. అతి త్వరలో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించి నేడు మూవీ టీం ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ మీట్ లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. కలర్స్ స్వాతి మరియు సాయి ధరమ్ తేజ్ ఇంత మంచి స్నేహితులు అనే విషయం ఈరోజే తెలిసింది.

- Advertisement -

వీళ్లిద్దరు ఒకే కాలేజీ లో చదువుకునేవారట. అప్పట్లో జరిగే పరీక్షలలో ఈమె పేపర్ నుండే సాయి ధరమ్ తేజ్ కాపీ కొట్టేవాడట. స్వాతి ని సాయి ధరమ్ తేజ్ ‘స్వాతి గాడు’ అని పిలవడం విశేషం. ఇద్దరు స్టేజి మీద జోకులు వేసుకుంటూ సరదాగా మాట్లాడగా , దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. అంతే కాకుండా కలర్స్ స్వాతి సాయి ధరమ్ తేజ్ కి ముద్దుపెట్టడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here